ఐదు పేజీల డైలాగ్‌.. సింగిల్ టేక్‌లో

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌… ఈ మ‌ధ్య తెలుగునాట గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు ‘క్రాక్‌’లో త‌న పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. ‘నాంది’లో వ‌ర‌లక్ష్మి పాత్ర గుర్తుండిపోతుంది. ఈ రెండు సినిమాల త‌ర‌వాత‌.. వ‌రుస‌గా ఆమెకు అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు త‌మిళం కంటే తెలుగులోనే ఎక్కువ బిజీ. అందుకే త‌న మ‌కాం చెన్నై నుంచి హైద‌రాబాద్ కు మార్చేసింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ‘వీర సింహారెడ్డి’లో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త‌న కెరీర్‌కి ఓ మేలిమి మ‌లుపు అని భావిస్తోంది వ‌ర‌ల‌క్ష్మి. ఈ సినిమాలో 5 పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పేసి… బాల‌య్య‌తో పాటు చిత్ర‌బృందానికీ షాక్ ఇచ్చింద‌ట వ‌రల‌క్ష్మి.

‘వీర సింహారెడ్డి’కి సంబంధించిన ఓ ఎమోష‌న‌ల్ సీన్‌ని బాల‌య్య – వ‌ర‌ల‌క్ష్మిల మ‌ధ్య ఇటీవ‌లే తెర‌కెక్కించారు. ఇందులో వ‌ర‌ల‌క్ష్మికి ఏకంగా 5 పేజీల డైలాగ్ ఉంది. దాదాపు మోనో యాక్ష‌న్‌లాంటిది. బాల‌య్య ముందు ఈ డైలాగ్ చెప్పాలి. వ‌ర‌ల‌క్ష్మికి తెలుగు అంతంత మాత్ర‌మే వ‌చ్చు. పైగా ముందున్నది బాల‌య్య‌. కాబ‌ట్టి.. ఈ సీన్ పూర్త‌య్యే స‌రికి ఓ రోజు ప‌డుతుందని అంతా ఫిక్స‌యిపోయారు.కానీ వ‌ర‌ల‌క్ష్మి మాత్రం ఈ 5 పేజీల డైలాగ్ నీ సింగిల్ టేక్‌లో చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది. డైలాగ్ పూర్త‌వ‌గానే యూనిట్లోని స‌భ్యులంతా చ‌ప్ప‌ట్లు కొట్టార‌ట‌. బాల‌య్య‌తో స‌హా. థియేట‌ర్లో కూడా ఈ సీన్ క్లాప్ కొట్టిస్తుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సంక్రాంతికే ‘వీర సింహారెడ్డి’ విడుద‌ల కాబోతోంది. స‌మంత న‌టించిన ‘య‌శోద‌’లోనూ వ‌ర‌ల‌క్ష్మి కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 11న ‘య‌శోద‌’ విడుద‌ల అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close