విశ్వ‌క్‌సేన్ స్థానంలో శ‌ర్వానంద్‌?

అర్జున్ – విశ్వ‌క్‌సేన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. కానీ… ఆగిపోయింది. ఈ సినిమా నుంచి విశ్వ‌క్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. కార‌ణాలేమైనా… ఇప్పుడు అర్జున్ మ‌రో హీరోని వెదుక్కోవాల్సిందే. ఇప్పుడు అర్జున్ దృష్టి శ‌ర్వానంద్‌పై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. శర్వాకి ఈ క‌థ బాగా సూట‌వుతుంద‌ని అర్జున్ భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ ని క‌లిసి, ఈ క‌థ గురించి చ‌ర్చించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. క‌థ విన్న త‌ర‌వాత‌… శ‌ర్వా ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటాడో చూడాలి.

కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఒప్పుకొన్నాడు శ‌ర్వా. శ్రీ‌రామ్ ఆదిత్య కూడా శ‌ర్వాకి ఓ క‌థ వినిపించాడు. ఇది కాకుండా మ‌రో సినిమా కూడా ఒప్పుకొన్నాడు. ఈ మూడింటి మ‌ధ్య అర్జున్ క‌థ‌కు శ‌ర్వా ఓకే చేస్తాడా? అనేది అనుమాన‌మే. పైగా… అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ త‌న హీరోపై… ఆరోప‌ణ‌లు చేయ‌డంతో.. యూత్ హీరోలు ఇప్పుడు అర్జున్ తో సినిమా చేయ‌డానికి కాస్త వెనుకంజ వేసే అవ‌కాశం ఉంది. కాక‌పోతే… అర్జున్ చేతిలో టైమ్ లేదు. న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్ల‌కు అడ్వాన్సులు ఇచ్చి డేట్లు లాక్ చేసుకొన్నాడు. త‌ను పిలిస్తే వ‌చ్చేసి, కావ‌ల్సిన‌న్ని కాల్షీట్లు ఇచ్చే హీరో అర్జున్‌కి కావాలి. మ‌రి.. అలాంటి హీరో ఎవ‌రు దొరుకుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close