టీఆర్ఎస్ హైకమాండ్‌ను టెన్షన్ పెట్టిన తుమ్మల !

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో ఎప్పుడు ఏ లీడర్ ఉంటారో .. ఊడతారో తెలియని పరిస్థితి . అందరూ సీనియర్లే. అందరికీ బలమైన వర్గం ఉంది. కానీ కేసీఆర్ అందరికీ ప్రాధాన్యం ఇవ్వలేని పరిస్థితి. అసలే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఏ లీడర్ ఎలాంటి అడుగు వేసినా అనుమానంగా చూసే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో .. తుమ్మల నాగేశ్వరరావు.. వాజేడులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనుచరులు తరలి వచ్చారు. కనీసం ఐదు వందల కార్లతో ర్యాలీ కూడా నిర్వహించారు.

తుమ్మల హడావుడి చూసి అందరూ .. ఆయన ఏదో పార్టీ మారబోతున్నారని అనుకున్నారు. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ఆయనతో మాట్లాడింది. అయితే తుమ్మల కూడా .. తన ఆత్మీయ సమావేశం నిజంగానే ఆత్మీయమైనదేనని.. రాజకీయం కాదని వారికి భరోసా ఇచ్చారు. అయినా వారిలో అనుమానం అలాగేఉంది. సమావేశంలో తుమ్మల కూడా కాస్త విధేయంగా.. కాస్త వింతగా మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని అందర్నీ కోరారు. తాను కూడా పార్ట మారడం లాంటివి చేయబోనన్నారు. అయితే సీతారామస్వామి ప్రాజెక్ట్ కోసమే కేసీఆర్‌తో పని చేస్తున్నానని ట్విస్ట్ ఇచ్చారు.

తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ముందుగా జరిగినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఖమ్మం జిల్లా నాయకులు.. తమ సీటును ఏదో ఓ పార్టీలో ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్‌లో అలజడి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇసుక అక్ర‌మ మైనింగ్- జ‌గ‌న్ స‌ర్కార్ పై సుప్రీం సీరియ‌స్

ఇసుక అక్ర‌మ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేత‌ల‌కు ఎంత బిజినెస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నేత‌లంతా సిండికేట్ అయి ఇసుక‌ను బంగారంలా ధ‌ర‌లు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్ల‌గొట్టిన...

నెల రోజుల్లో రేవంత్ స‌ర్కార్ కూలుతుంది… బీజేపీ ఎంపీ జోస్యం

తెలంగాణ‌లో పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల ప్ర‌చారంతో పాటు మాట‌ల వేడి కూడా పెరుగుతోంది. అయితే, బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి...

నర్సరావుపేట రివ్యూ : గాలి మారుతోంది !

నర్సరావుపేట కోడెల హయాంలో వైసీపీ కంచుకోట. కానీ నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటంతో .. కోడెల సొంత మండలాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో చేర్చేశారు. అదనంగా రెడ్డి...

కడపలో వైఎస్ ఓటు బ్యాంక్ చెరో ఓటు ట్రెండ్ – అవినాష్ పుట్టి మునిగినట్లే !

కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close