ముందస్తు దిశగా కేసీఆర్ స్పీడ్ !

రాజకీయ పార్టీల నేతల మాటలకు అర్థాలే వేరని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అవునంటే కాదని.. కాదంటే ఔనని.. ఒక్కో సారి… ఔనంటే.. అవుననే అర్థం చేసుకోవాలి. ఆ మాటల్లో అర్థం.. ఎలా తెలుసుకోవాలంటే… ఆ లీడర్లు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే. ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలను డీకోడ్ చేస్తే.. ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లబోతున్నారని అనిపిస్తుంది.

మార్చిలోపు అభివృద్ది పనులన్నీ కళ్ల ముందు కనిపించేలా ప్లాన్ !

రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్లను మెరుగ్గా తీర్చిదిద్దేలా కాంట్రాక్టులు పిలుస్తున్నారు. సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో సంక్రాంతికి ప్రారంభించనున్నారు. అమరుల స్మారకాన్నీ అదే రోజు ప్రారంభిస్తారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరిస్తారు. మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేయబోతున్నారు.

ఉద్యోగాల భర్తీలో దూకుడు !

కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఎనభై వేల ఉద్యోగాల భర్తీలో ఇప్పుడు వేగం పుంజుకుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్షలు నడుస్తున్నాయి. తాజాగా మరో తొమ్మిది వేల ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో నిరుద్యోగులంతా బిజీగా ఉన్నారు. మార్చి వరకూ నియామకాల జోరు కొనసాగే అవకాశం ఉంది.

వరుసగా జిల్లాల పర్యటనలు !

డిసెంబర్‌ మొదటి వారం నుంచి సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

పార్టీ నేతల ఆత్మీయ సమావేశాలు !

పార్టీలో ఏమైనా విభేధాలు ఉంటే.. పరిష్కరించుకోవడానికి ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలనికేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. మండలాల వారీగా పార్టీ కేడర్‌తో ఆతీ్మయ సమ్మేళనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిల కోసం జాబితాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించారు. ఇవన్నీ మార్చిలోపు పూర్తయిపోతాయి.

కర్ణాటకతో పోటే వెళ్తారా ?

ఎలా చూసినా కేసీఆర్ మార్చి నాటికి ఎన్నికలకు రెడీ అయిపోతారు. బడ్జెట్ పెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీని రద్దు చేయవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వచ్చే ఏడాది మేలోపు ఎన్నికలు జరపాల్సి ఉంది. అప్పుడే తెలంగాణలోనూ ఎన్నికలు పెట్టే చాన్స్ ఉంది. అందుకే కేసీఆర్ ఢిల్లీ రాజకీయ ప్రణాళికలు ప్రస్తుతానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close