“దత్త” ముద్ర వేస్తే పవన్, షర్మిల వీకైపోతారా ?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దత్త పుత్రుడు, దత్తపుత్రిక అంటూ రాజకీయ విమర్సలు ఎక్కువైపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన.. తెలంగాణలో షర్మిలపైనా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. పవన్‌ను వైసీపీ అలా టార్గెట్ చేస్తూంటే.. తెలంగాణలో షర్మిలను టీఆర్ఎస్ దత్తపుత్రిక అంటోంది. ఏపీలో జనసేనపైన, తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీపైన ఇలాంటి దత్తత ప్రచారం ఉద్ధృతంగా ఆయా పార్టీలు చేయడానికి కారణం.. ఆ పార్టీల వల్ల ఎంతో కొంత ముప్పు ఉందని అనుకోవడమే.

ఆ పార్టీల వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించి.. వారి ప్రఛారాన్ని తగ్గించడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణ్ బలపడితే ఆ మేరకు తమకు నష్టం జరుగుతుందని.. అదే ఆయన చంద్రబాబు కోసంపని చేస్తున్నారని ప్రచారం చేస్తే.. ఆయన క్యాడర్ కూడా తమ వైపు మొగ్గుతారని వైఎస్ఆర్‌సీపీ అంచనా. అదే సమయంలో షర్మిల పై బీజేపీ ముద్ర వేస్తే.. ఆమెకు ఓట్లేయాలనుకున్న వారు ఆగిపోతారని టీఆర్ఎస్ అంచనా వేస్తోందని అనుకోవచ్చు.

నిజానికి ఏపీలో జనసేన అయినా.. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అయినా అధికారం చేపడతామనే ధీమాతో ఉన్నాయి. చాన్స్ ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాయి. అయితే వారిని ప్రధాన ప్రత్యర్థులుగా భావించని అధికార పార్టీలు మాత్రం.. ఇతరులతో కలిపేందుకు శక్తివంచన లేకుండా దత్తత వ్యూహంతో రాజకీయాలు చేస్తున్నాయి. వీటిని ఎంత సమర్థంగా ఎదుర్కొంటే.. జనసేన, వైఎస్ఆర్‌టీపీలకు అంత మేలు, తిప్పి కొట్టకపోతే అధికార పార్టీల రాజకీయ వ్యూహంలో ఇరుక్కుపోయినట్లే. ఇప్పటికైతే రెండు పార్టీలు బలంగానే తిప్పి కొడుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీకి కౌంటర్‌గా జనసేన పార్టీ నేతలు.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తున్నారు. షర్మిల అయితే టీఆర్ఎస్‌ను బీజేపీ పెళ్లాంగా తేల్చేశారు.

ఓ రాజకీయ పార్టీని ప్రధాన ప్రత్యర్థితో కలిపేయడం ద్వారా.. శత్రవులంతా ఒకటే అని చెప్పాలని అధికార పార్టీలు భావిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close