అంద‌రి క‌ళ్లూ.. ‘అవ‌తార్’ పైనే

డిసెంబ‌రు 16.. ప్ర‌పంచ సినిమా మొత్తం.. ఈ రోజు ఎప్పుడొస్తుందా? అని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. అది అవ‌తార్ 2 రిలీజ్ డేట్‌. అవ‌తార్ లో జేమ్స్ కెమ‌రూన్ సృష్టించిన అద్భుతం ఇంకా క‌ళ్ల ముందు క‌దుల‌తూనే ఉంది. ఆ సినిమా విడుద‌లైన ప‌న్నెండేళ్ల‌కు సీక్వెల్ వ‌స్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 160 భాష‌ల్లో విడుద‌ల అవుతున్న సినిమా ఇది. ఇన్ని భాష‌ల్లో ఓ సినిమా రిలీజ్ కావ‌డం.. ఇదే రికార్డ్‌. దాదాపుగా ప‌దిహేను వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ఈ సినిమాని రూపొందించారు. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఇదే ఖ‌రీదైన చిత్రం. ఈ సినిమా కోసం కొత్త కెమెరాల్నీ, కొత్త టెక్నాల‌జీనీ క‌నిపెట్ట వ‌ల‌సి వ‌చ్చింది. 90 శాతం చిత్రీక‌ర‌ణ నీటిలోనే జ‌రిగింది. వారం రోజుల క్రితం… లండ‌న్ లో ప్రీమియ‌ర్ షో ప్ర‌ద‌ర్శించారు. ఈ షోకి హాజ‌రైన క్రిటిక్స్ దీన్నో మాస్ట‌ర్ పీస్ గా అభివ‌ర్ణిస్తున్నారు. ఇండియాలోసైతం ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల‌లో అడ్వాన్స్ బుకింగులు మొద‌లైపోయాయి. త్రీడీ స్క్రీన్స్ అన్నీ దాదాపుగా ఫుల్ అయ్యాయి. ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్‌లో ఈ సినిమాని చూడాల‌ని న‌గ‌ర వాసులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ థియేట‌ర్లో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. ఈనెల 16న తెలుగు నాట పెద్ద సినిమాలేం విడుద‌ల కావ‌డం లేదు. అదంతా.. `అవ‌తార్ 2` ఎఫెక్టే అనుకోవాలి. ఓ పెద్ద హీరో సినిమా విడుద‌లైతే ఎంత హ‌డావుడి ఉంటుందో.. అవ‌తార్ 2కి అంత హ‌డావుడి క‌నిపిస్తోంది. ఓ హాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమా కోసం ఇంత చ‌ర్చ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారేమో..? మ‌రి అవ‌తార్ 2 ఈ అంచ‌నాల్ని ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకొంటుందో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బ్యాన‌ర్‌ని న‌మ్ముకొని న‌లిగిపోతున్న ద‌ర్శ‌కుడు

తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన ద‌ర్శ‌కుడు...అనుదీప్‌. 'జాతిర‌త్నాలు' సినిమాతో కామెడీలో ఓ ట్రెండ్ సృష్టించాడు. 'ప్రిన్స్' కూడా త‌న మార్క్ వినోదాన్ని పంచి పెట్టింది. అయితే ఆ త‌ర‌వాత త‌న నుంచి మ‌రో...

‘క‌ల్కి’.. రెండు కాదు… నాలుగు

బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయ‌ర్ గా అంద‌రి నోళ్ల‌లో నానుతున్న సినిమా 'కల్కి'. గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యం లేక‌, బాక్సాఫీసు స్త‌బ్దుగా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ కాస్త...

రుషికొండ – ఓ విధ్వంసకారుని పాలనా చిహ్నం

విశాఖ సుందరనగరం. ఆ నగరానికి రుషికొండ ఓ ఆభరణం. అక్కడకు వెళ్లే పర్యాటకులకు రుషికొండలోని హరిత రిసార్ట్స్ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది బీచ్ వ్యూలో ఒకటి, రెండు రోజులు సేదదీరి మంచి...

జాక్‌పాట్ కొట్టిన ఎన్వీ ప్ర‌సాద్‌

డ‌బ్బింగ్ సినిమా అంటే వెంట్రుక వేసి, కొండ‌ని లాగే ప్ర‌య‌త్న‌మే. వ‌స్తే.. కొండ‌, పోతే వెంట్రుక‌. కాక‌పోతే... డ‌బ్బింగ్ సినిమాల్ని న‌మ్ముకొని 'బోడిగుండు'తో మిగిలిన వాళ్లుఉన్నారు. కొన్నాళ్లుగా డ‌బ్బింగ్ సినిమాల‌కు కాసులు రాల‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close