‘పుష్ప’ గ్లిమ్స్ ఏమైన‌ట్టు…?

‘అవతార్ 2’ కోసం తెలుగు ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. అవ‌తార్ సృష్టించిన మ్యాజిక్ ఓ కార‌ణ‌మైతే… ‘అవ‌తార్ 2’ సినిమాతో పాటుగా ‘పుష్ప 2’ గ్లిమ్స్ కూడా విడుద‌ల చేయాల‌నుకోవ‌డం మ‌రో కార‌ణం. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొన్న పుష్ప సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. దాంతో పుష్ప 2పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌లే ఈ సినిమా ప‌ట్టాలెక్కింది. ‘అవ‌తార్ 2’ ఆడుతున్న థియేట‌ర్ల‌లో `పుష్ప 2` గ్లిమ్స్ విడుద‌ల చేయాల‌ని భావించారు. అందుకోసం ఓ టీజ‌ర్ షూట్ కూడా చేశారు. అయితే… ఈ గ్లిమ్స్ అవ‌తార్‌తో పాటు బ‌య‌ట‌కు రాలేదు.

దానికి చాలా కార‌ణాలున్నాయి. ఇటీవ‌ల పుష్ప టీమ్ ర‌ష్యా వెళ్లొచ్చింది. ఇది స‌డ‌న్‌గా సెట్ చేసిన షెడ్యూల్. దాంతో.. ‘పుష్ప 2’ గ్లిమ్స్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆల‌స్య‌మైంది. దాంతో పాటుగా ‘పుష్ప 2’లో డైలాగ్ ఇదే.. అంటూ ఓ డైలాగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ డైలాగ్ లీక్ అయిపోవ‌డంతో ‘గ్లిమ్స్’ అంత‌గా కిక్ ఇవ్వ‌దేమో అని చిత్ర‌బృందం భావించింద‌ట‌. దాంతో ఆ డైలాగ్ మార్చి మరో టీజ‌ర్ రెడీ చేసే ప‌నిలో ప‌డింద‌ని టాక్‌. డిసెంబ‌రు 31న గానీ, సంక్రాంతి పండ‌క్కి గానీ కొత్త గ్లిమ్స్ విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే.. అవ‌తార్ లో పుష్ప క‌నిపించ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close