కేసీఆర్ సన్నిహితులూ బీజేపీకీ కోట్లలో విరాళాలిస్తున్నారు !

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన వారు కూడా బీజేపీకి కోట్లలో విరాళాలిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ ఫండ్ ద్వారా విరాళాలు ఇచ్చిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యశోదా ఆస్పత్రి ఏకంగా రూ.పది కోట్ల విరాళాన్ని బీజేపీకి ఇచ్చింది. యశోదా ఆస్పత్రి ఎవరిదో తెలంగాణ రాజకీయవర్గాలందరికీ తెలుసు. సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సమస్య వచ్చినా యశోదకే వెళ్తారు. టీఆర్ఎస్ నేతలకు ఆ ఆస్పత్రి.. తమ పార్టీ ఆస్పత్రి అన్నంత అనుబంధం ఉంటుంది. అలాంటి ఆస్పత్రి యాజమాన్యం.. బీజేపీకి ఏకంగా రూ. పది కోట్ల విరాళాన్ని ఇచ్చింది.

ఆ స్థాయిలో విరాళం ఇచ్చిన మరో కార్పొరేట్ సంస్థ లేదు. బీజేపీ నేత, విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన జి. వివెక్ మాత్రం రూ. మూడు కోట్లను విరాళంగా ఇచ్చారు. మిగిలిన వాళ్లు లక్షల్లోనే సమర్పించుకున్నారు. యశోదా ఆస్పత్రి యాజమాన్యానికి బీజేపీపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టిందనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇది ప్రేమ కాదని.. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో యశోదా ఆస్పత్రులపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ విరాళం ఇచ్చిందని.. మధ్యలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నాయి.

రాజకీయ పార్టీలు ఈసీకి ఇచ్ిచన వివరాలు ఆధారంగా ఏడీఆర్ సంస్థ ఈ డీటైల్స్ విడుదల చేసింది ఎలక్టోరల్ బాండ్స్ .. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళిచ్చే సౌకర్యం ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలిస్తే.. పూర్తి గోప్యం. ట్రస్టుల ద్వారా ఇస్తే.. పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. మొత్తానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో 75 శాతం బీజేపీకే వెళ్తాయి. మిగతా పాతిక శాతం అన్ని పార్టీలు పంచుకుంటాయి. ప్రాంతీయ పార్టీల కన్నా అతి తక్కువగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close