రివ్యూ: కొరమీను

Korameenu movie telugu review

తెలుగు360 రేటింగ్ 2.25/5

రచయితగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నాడు ఆనంద్ రవి. ఆయన రాసిన ప్రతినిధి, నటుడిగా చేసిన నెపోలియన్ చిత్రాలు భిన్నమైనవిగా ప్రశంసలు పొందాయి. ఇప్పుడ ఆనంద్ రవి ప్రధాన పాత్రలో ‘కోరమీను’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీపతి కర్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు స్వయంగా ఆనంద్ రవి అందించాడు. భిన్నంగా ఆలోచిస్తాడనే పేరున్న ఆనంద్ రవి కొరమీనులో ఎలాంటి కథ చెప్పాడు ? ‘స్టోరీ ఆఫ్ ఇగోస్’ అన్న కాప్షన్ కి ఎలాంటి జస్టిఫికేషన్ ఇచ్చారు?

విశాఖపట్నం సముద్రతీరాన్ని అనుకోని వున్న మత్స్యకారుల కాలనీ జాలరిపేట. అక్కడికి మీసాల రాజు (శత్రు) అనే ఎంకౌంటర్లు స్పెషలిస్ట్ విజయవాడ నుంచి బదిలీపై వస్తాడు. అయితే వచ్చీరాగానే తను పరువుగా పెంచుకున్న మీసాన్ని ఎవరో కత్తిరించేస్తారు. దీంతో అతడి ఇగో దెబ్బతింటుంది. కరుణ(హరీష్ ఉత్తమన్) డబ్బు, పలుకుబడి వున్న వ్యక్తి. హార్బర్ లో ఫిషింగ్ బిజినెస్ చేస్తుంటాడు. అతడంటే అందరికీ హడల్. కరుణ దగ్గర డ్రైవర్ గా పని చేస్తుంటాడు జాలరిపేటకి చెందిన కోటి (ఆనంద్ రవి). మీనాక్షి (కిషోరీ దత్రక్) జాలరిపేట కాలనీ అమ్మాయి. కోటికి మీనాక్షి అంటే ఇష్టం. చిన్నపాటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ మీనాక్షికి మాత్రం కరుణ అంటే ప్రేమ. కరుణ, మీనాక్షి శారీరకంగా కూడా ఒక్కటైపోతారు. కానీ పెళ్లి చేసుకోమంటే మాత్రం మొహం చాటేస్తాడు కరుణ. మీనాక్షిని దారుణంగా అవమానిస్తాడు. దీంతో మీనాక్షి అహం దెబ్బతింటుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? తను ప్రేమించిన అమ్మాయి కోసం కోటి ఏం చేశాడు ? కరుణ నుంచి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ? అసలు మీసాల రాజు మీసం తీసింది ఎవరు ? కోటి, మీనాక్షి కలసి కరుణకి ఎలా బుద్ధి చెప్పారు ? అనేది మిగతా కథ.

పెద్దింటి అమ్మాయి… పేదింటి అబ్బాయి మధ్య ప్రేమ తెలుగు చిత్ర పరిశ్రమలో అరిగిపోయినా ఫార్ములానే అయినా ఎవర్ గ్రీన్ ఫార్ములా. పేద, ధనిక, కుల, వర్గ అంతరాలని నేపధ్యాన్ని కమర్షియల్ గా చెప్పొచ్చు, సహజంగానూ చిత్రీకరీంచవచ్చు. చెప్పే విధానంలో కొత్తదనం వుంటే ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దమే. మొన్నామధ్య వచ్చిన ఉప్పెన సినిమానే దీనికి నిదర్శనం. ‘కోరమీను’ కూడా పేద, ధనిక వర్గాల మధ్య కథే. అయితే ఇందులో వెరైటీ ఏమిటంటే .. పెద్దింటి అబ్బాయి.. పేదింటి అమ్మాయిని మోసం చేస్తాడు. తర్వాత కథ ఇగో వైపు మలుపు తీసుకుంటుంది. కానీ ఈ మలుపుని ఇగో వార్ లా కాకుండా.. ఒక కిడ్నాప్ డ్రామాకి కనెక్ట్ చేయడం అంతగా రుచించలేదు.

పేద, ధనిక పోరులా కాకుండా ఇగో వార్ లా కథని నడపాలనేది దర్శకుడి ఆలోచన. ఈ అలోచన బావుంది కానీ దాన్ని అమలు చేయడంలో తడబాటు కనిపించింది. మీసాల రాజు మీసాలు తీసేస్తే అతడి ఈగో హార్ట్ అవుతుంది. మీనాక్షిని కరుణ మోసం చేస్తే ఆమె ఈగోహార్ట్ అవుతుంది. తాను ప్రేమించిన అమ్మాయిని రాత్రికి తీసుకురా అంటే కోటి అహం దెబ్బతింటుంది. ఇలా ముగ్గురి ఇగోలు దెబ్బతినడానికే ప్రధమార్ధం గడిచిపోతుంది. భారీ ఎలివేషన్ తో వచ్చిన మీసాల రాజు.. పోలీస్ స్టేషన్ లో ముత్యం చెబుతున్న కథకి ఊ కొడుతుంటాడు. కోటి, కరుణ, మీనాక్షిల మధ్య జరిగిన కథ కూడా ఊహకి అందిపోతుంటుంది. అయితే ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నీవేశాలు మాత్రం కాస్త ఇంటెన్స్ ని పెంచుతాయి. తాను కోరుకున్న అమ్మాయినే మరో వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లడం, అదే అమ్మాయి మోసం పొయిందని తెలిసి మళ్ళీ ప్రేమించడం, వీరి ప్రేమని మోసం చేసిన వ్యక్తి తట్టుకోలేకపోవడం.. తర్వాత వచ్చిన ఇంటర్వెల్ బాంగ్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచాయి.

‘స్టోరీ ఆఫ్ ఇగోస్’ అన్న కాప్షన్ కి ద్వితీయార్థంలో న్యాయం చేస్తారని మళ్ళీ సీట్లో కూర్చుంటాడు ప్రేక్ష‌కుడు. కానీ అది అత్యాస అని కాసేప‌ట్లోనే అర్థ‌మైపోతుంది. అప్పటి వరకూ స్టేషన్ లో కథ వింటూ కూర్చున్న మీసాలులేని రాజు.. ఇక నేను డ్యూటీ చేయాలని జాలరిపేటకి వస్తాడు. పాపం.. కథలో కీలక పాత్రలేవీ అతడికి కనిపించవు. త‌న‌కే కాదు ప్రేక్షకుడికి కూడా. కరుణ, కోటి, మీనాక్షి మాయమైపోతారు. కిడ్నాప్ డ్రామా తెరపైకి వస్తుంది. ఎవరిని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదనేది దర్శకుడి భావన. కానీ మొదటిసారి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా.. కిడ్నాప్ చేసింది ఎవరో మంచినీళ్ళు తాగేసినంత సులువుగా చెప్పేస్తాడు. మీసల రాజుని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం గంద‌రగోళంగా వుంటుంది. దర్శకుడు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం సీన్లు తీసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. స్క్రీన్ ప్లే లో ఇదొక వెరైటీ అనుకోవాలి. మధ్యలో ఉప్పెన టైపులో హీరో తండ్రిని చంపేసిన సీక్వెన్స్ ఒకటుంది. ఈ కథకి అది అత‌క‌లేదు. అహం వ్యక్తిగతం. ఒక సామాన్యుడి ఆత్మాభిమానాకి భంగం వాటిల్లితే.. అతడే నిలబడి ఎదురుతిరిగే కథనే మరో సామాన్యుడు కనెక్ట్ చేసుకుంటాడు. ఇందులో మాత్రం అజ్ఞాతంలో ఉంటూ ఏదో ప్లాన్ చేసి పరోక్షంగా ప్రతీకారం తీర్చుకోవడానికి కథానాయకుడి చేసిన ప్రయత్నం మెప్పించదు.

ఆనంద్ రవి మరోసారి సహజమైన పాత్రలో కనిపించాడు. ఎక్కడా హీరోయిజం లేకుండా ఆ పాత్రని డిజైన్ చేయడం బావుంది. హరీష్‌ ఉత్తమన్‌ మరోసారి విలనిజం చూపించాడు. ఆయన ప్రెజెన్స్‌ కథలో ఇంటెన్స్ తీసుకొచ్చింది. కిశోరీ ధాత్రక్‌ మీనాక్షి పాత్రకు సరిపోయింది. అందం మాట పక్కన పెడితే.. ఆమె కళ్ళలో మంచి భావవ్యక్తికరణ వుంది. మంచి నటి అవుతుంది. శత్రు పాత్రకు చాలా బిల్డప్ ఇచ్చి సినిమాటిక్ గా నడిపారు. రాజా రవీంద్ర, ఇందు కుసుమ, గిరిధర్‌, ఇమ్మాన్యుయేల్‌ పాత్రలు పరిధిమేర వున్నాయి.

నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. కార్తీక్ కొప్పెర కెమెరా పనితనం బావుంది. సముద్ర తీరాన్ని చక్కగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఒక పాట బావుంది. ‘సెకండ్ హ్యాండ్’ అని చెప్పే డైలాగు గుర్తుంటుంది. అలాగే ”అన్ని చేపలు ఒకేసారి ఈదితే ఎంతపెద్ద వలైన తెగిపోతుంది’ లాంటి మాటలు కొన్ని ఆకట్టుకుంటాయి. ఈ కథ విరామంలో కోటి, మీనాక్షి ఇద్దరూ కరుణ ముందు ధైర్యంగా నిలబడతారు. చిన్న సినిమానే అయినా పెద్ద ఎమోషన్ పట్టుకున్నారనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ద్వితీయార్ధంలో కూడా ఆ ఎమోషన్ ని అలానే కోనసాగించుటే కొరమీను రుచి కొంతలో కొంత బావుండేది.

ఫినిషింగ్ టచ్: ‘కొరమీను’ ప‌ట్టు జారింది!

తెలుగు360 రేటింగ్ 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close