ఆర్కే పలుకు : కేసీఆర్ కథ అడ్డం తిరిగింది !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో రాసే కొత్త పలుకులో ఈ సారి కాస్త విజయగర్వం కనిపించింది. తాను చాలా కాలంగా కేసీఆర్ కు ఇస్తున్న సలహాలు పెడచెవిన పెట్టిన కారణంగా ఇప్పుడు నిండా ఇరుక్కుపోయారన్న భావనలో ఆయన కేసీఆర్‌కు పరోక్షంగా సుద్దులు చెప్పిన అంశంగా స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐకి వెళ్లడంపై ఆయన చాలా లోతుగా విశ్లేషణ జరిపారు. అయితే ఈ విశ్లేషణ అంతా.. పూర్తిగా కేసీఆర్ ను .. బీఆర్ఎస్‌ను భయ పెట్టడానికే అన్నట్లుగా సాగిపోయింది. హైకోర్టు జడ్జిమెంట్‌లో అసలు కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించింది. ఇదే అంశం ఆధారంగా కేసీఆర్ ను కేంద్రం బుక్ చేయబోతోందని.. ఆర్కే చెబుతున్నారు.

అంతే కాదు… కేసీఆర్ మాటలు విని పోలీసు అధికారులు స్టీఫెన్ రవీంద్ర, సీవీ ఆనంద్ కూడా ఇరుక్కున్నారని.. వారిని కూడా సీబీఐ ప్రశ్నిస్తుందని ఆర్కే చెబుతున్నారు. ఓ రకంగా ఆర్కే పోలీసుల్లో… ప్రభుత్వం చెప్పిన మాటలు వినకుండా భయాందోళనలు కల్పించారని అనుకోవచ్చు. ఫామ్ హౌస్ కేసు పూర్తిగా ట్రాప్ అని.. పెగాసస్ లాంటి సాఫ్ట్ వేర్లతో నిఘా పెట్టి.. అన్నీ రికార్డు చేసిన తర్వాత పట్టుకున్నారని.. అవన్నీ సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయన్నట్లుగా ఆర్కే హింటిచ్చారు. తన వ్యాసం అంతా.. ఆర్కే ఇలాగే చెప్పారు. గతంలో బీజేపీతో పెట్టుకోవద్దని ఆయనచాలా సార్లు కేసీఆర్ కు తన ఆర్టికల్ ద్వారా పరోక్షంగా సలహాలిచ్చారు. కానీ కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఆర్కే.. తాను చెప్పిందే నిజమవుతుందన్నట్లుగా రాశారు.

ఇక ఏపీ రాజకీయాల గురించి రాయకుండా.. ఆర్కే కథనం పూర్తి కాదు కాబట్టి… ఏపీలో ముందస్తు ఎన్నికలపైనా రాశారు. జగన్ .. ప్రధాని మోదీని ముందస్తు ఎన్నికలకు సహకిరంచాలని కోరితే.. మీరే ఆలోచించుకోవాలని మోదీ చెప్పారని.. ఆర్కే రాసుకొచ్చారు. ఇక్కడ ఎప్పట్లాగే.. ఆయనకు ఎలా తెలిసిందనే సందేహం వస్తుంది. నిజమో కాదో ఎవరికీ తెలియదు. కానీ.. వైసీపీలో మాత్రం అతంర్గత సంక్షోభం ముదిరిపోతోందని.. ఐదారుగురు ఎంపీలు.. ఇరవై మంది వరకూ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్కే మైండ్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే.. ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనతో టచ్ లోకి వచ్చారా అన్నది కవర్ చేసుకున్నారు. అయితే చంద్రబాబు,లోకేష్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాత్రం తేల్చేశారు.

ఆర్కే రాతల్లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్నవి.. తెలంగాణలో అయితే కేసీఆర్‌కు పరోక్షంగా సలహాలివ్వడం.. ఏపీలో అయితే.. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పడం. ఈ సారి కూడా ఆ ట్రెండ్ మార్చలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close