చైతన్య : రోడ్డు ప్రమాదాల్లో లక్షల్లో చనిపోతున్నారు జగనన్నా.. జీవో ఇచ్చేద్దామా ?

హవ్వ రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా ? అదీ బ్రిటిషర్లు స్వాతంత్ర్య ఉద్యమాన్ని నిరోధించడానికి చట్టాన్ని తెరపైకి తెచ్చి..! ఇలాంటి సలహా జగన్ కు ఇచ్చిన సలహాదారుడెవరో కానీ.. ఖచ్చితంగా జగన్ కు కీడు చేసే ఉద్దేశంలోనే ఉన్నారు. ఈ జీవో వల్ల ప్రతిపక్షలు సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవు సరి కదా.. ప్రజల్లో జగన్ పై ఓ రకమైన ఇమేజ్ బలపడిపోతోంది. ఆయన విపక్షాలను కంట్రోల్ చేయడానికి దారుణాలకు ఒడిగడుతున్నారని నమ్మే పరిస్థితి వచ్చింది. జగన్ భయపడిపోతున్నారన్న అభిప్రాయం బలపడేలా చేస్తోంది.

కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక కుట్ర ఉందని నమ్మేలా నిర్ణయం !

“లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు యాత్రలు, పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఇలా విపక్ష నేతలు జనంలోకి వెళ్తున్నారు. చంద్రబాబు పర్యటనలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే సీన్ మారిపోతుంది. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభిస్తే ఇక జగన్ గురించి చెప్పుకునేవారే ఉండరు…. దీని గురించి ఏం చేయాలంటే వారు యాత్రలు చేయకుండా ఆపాలి. ఆ క్రమంలో జరిగిన పరిణామాలే కందుకూరు, గుంటూరు ఘటనలు..” అని నిన్నామొన్నటిదాకా జనం గుసగుసలాడుకునేవారు. కాని ఈ జీవో ఇచ్చిన తర్వాత 90 శాతం ప్రీప్లాన్డ్ అని నమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా జగన్ స్వయంకృతం . ఆయనకు సలహాలిచ్చిన వారి పైత్యం. కారణం ఏదైనా అమలు చేయలేని జీవో ఇచ్చి చేతకాని తనాన్ని.. కుట్ర కోణాన్ని జగన్ బయట పెట్టుకున్నారు.

తొక్కిసలాట ఘటనలు కొత్త కాదు. ..మళ్లీ జరగకుండా ఉండవు…. తీసుకోవాల్సింది జాగ్రత్తలు !

భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనలు జనాలు గుమికూడిన దగ్గర జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిష్కారం జనాలు గుమికూడకుండా నిషేధించడం కాదు. ఎందుకంటే.. ఇలా ప్రజలు ఒకే చోట చేరడానికి అనేకానేక కారణాలు ఉంటాయి. దేవుడి దర్శనం కోసం… సంబరాలు చేసుకోవడం కోసం.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై నిరసన తెలుపడం కోసం ఇలా అనేక సందర్భాలు ఉంటాయి. వాటిని జీవోలతో నియంత్రించలేరు. అలా నియంత్రించాలనుకుంటే ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వాల బాధ్యత వాటిపై నిషేధించడం కాదు… జాగ్రత్తలు తీసుకోవడం. జరుగోతంది ప్రభుత్వ వ్యతిరేక సభ కాబట్టి…. ప్రభుత్వ పోలీసుల్ని పెట్టి జనరల్ డయ్యర్ లా కాల్చి పారేయమని చెప్పడానికి ఇదేమీ బ్రిటిష్ రూల్ కాదు.. ప్రజాస్వామ్యం కాబట్టి… భద్రతా ఏర్పాట్లు చేయాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కానీ నిషేధించడం పిరికి చర్య .

రోడ్డు ప్రమాదాల్లో లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి… ప్రయాణాలు నిషేధిస్తారా ?

రోడ్డు పరమాదాల్లో నిత్యం లక్షల ప్రాణాలు పోతూంటాయి. ప్రభుత్వం సరైన రహదారులు నిర్మించక గోతుల్లో పడి చనిపోయేవారు ఎందరో ఉంటారు. అతి వేగం… డ్రైవింగ్ చేసే వారి నిర్లక్ష్యం.. ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి. ప్రమాదాలు జరుగుతున్నాయని…. లక్షల మంది ప్రాణాలు పోతున్నాయని… చెప్పి ప్రయాణాలను నిషేధించగలమా ? ప్రయాణం ఎప్పుడూ సాగుతూ ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిన్న లాజిక్ మిస్సయితే ప్రభుత్వానికి అంత కంటే తెలివి తక్కువ తనం ఉండదు.

ప్రజాభిమానం తనకు ఉందని జగన్ కు నమ్మకం లేదా ?

జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే… ఆయనకు తనకు ప్రజాభిమానం ఉందని అనుకోవడం లేదు. తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులకు ఉనికి లేకుండా చేసి తనను తాను విజేతగా ప్రకటించుకోవాలనుకుంటున్నట్లుగా ఉంది. ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు చివరికి ఏ దశకు చేరుస్తాయో జగన్‌కు ముందు ముందు తెలుస్తుంది.. ఇప్పటికైతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ముందే ఓడిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close