ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా – గెలిపించినందుకా ఇంత కక్షా ?

జగన్ అధికారం చేపట్టిన తర్వాత తొలి రోజుల్లో సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కలసి పని చేసుకుందాం.. కాల్లో ముల్లు గుచ్చుకున్నా తీస్తా.. మనందరి ప్రభుత్వం.. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత బాగా పని చేస్తారు అని తీయని మాటలు చెప్పారు. ఉద్యోగులు పొంగిపోయారు. ప్రయోజనాలు కల్పిస్తారు కదా అని ప్రభుత్వం చేసే అడ్డగోలు వ్యవహారాలకు మద్దతు పలికారు. కానీ నాలుగేళ్లు గడుస్తున్న సమయంలో ఇప్పుడేమయింది? ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనం నెర వేరకపోగా ఇప్పుడు .. పదో తరగతి పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ఏర్పాటు చేసే ఫ్లయింగ్ స్క్వాడ్ తరహాలో స్క్వాడ్లను ఏర్పాటు చేసి ఉద్యోగులు పని చేస్తున్నారో లేదో చూస్తారట. ఈ ఆలోచన వింటేనే… ఉద్యోగులు హా.. హతవిథి అనుకోక తప్పదు.

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నారన్నది వారికి అర్థం కావడం లేదు. గత ప్రభుత్వం ఎంత మేలు చేసినా.. అత్యధిక మంది ఉద్యోగులు జగన్ కే సపోర్ట్ చేశారు. ఆ విషయం పోస్టల్ బ్యాలెట్లలో వచ్చిన ఆధిక్యంలోనే స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి ఉద్యోగుల పట్ల జగన్ సానుకూలంగా వ్యవహరించాల్సి ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంది. కానీ హామీలను ఏ మాత్రం అమలు చేయకపోగా.. వారి పీఆర్సీని నియంత్రించారు. డీఎల విషయంలో మోసం చేస్తున్నారు. జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. వారు దాచుకున్న డబ్బులనూ ఇవ్వడం లేదు.

గతంలో చంద్రబాబు హయాంలో పంచ్ సిస్టం తీసుకు వస్తేనే ఉద్యోగులు రగిలిపోయారు. కానీ ఇప్పుడు ముఖ హాజరు తీసుకు వచ్చారు. చివరికి ఉద్యోగులు పనిచేస్తున్నారో లేదో నిగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పని చేయని ఉద్యోగుల్ని పట్టుకుంటారట. ప్రభుత్వ తీరు చూసి.. కాలికి అంటుకున్నది ముక్కుకు అంటించుకున్నట్లుగా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారంటే.. అదంతా వారి తప్పిదమే. చంద్రబాబు చేసే అడ్మినిస్ట్రేషన్ కు.. జగన్ చేసే పాలనకు తేడా ఇప్పటికి ఉద్యోగులకు కనిపిస్తోంది.

అయితే ఉద్యోగులకు అర్థం కాని విషయం ఏమిటంటే.. తాము ఇంతగా సపోర్ట్ చేసినా.. జగన్ తమను ఎందుకు వేధిస్తున్నారనేదే ?. అయితే యాభై శాతం ఓట్లేసిన జనాలను కూడా జగన్ అలాగే వేధిస్తున్నారని.. అందిరకీ అదే డౌట్ ఉందని… ఉద్యోగులకు మాత్రమే కాదన్న సెటైర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరియల్ న‌టుడు చందు ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణాలు ఇవేనా?

బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. కారణం త్రినయని సీరియల్ యాక్టర్స్ వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవ‌డ‌మే. మొదట ఈ సీరియల్ లో కీల‌క పాత్ర పోషించిన‌ పవిత్రా జయరాం యాక్సిడెంట్...

అప్పుడే చంద్రబాబు ఆన్ డ్యూటీ..!!

అల్లర్లతో ఏపీ అట్టుడుకుతుంటే సీఎంగా తన బాధ్యతను జగన్ రెడ్డి విస్మరించి విదేశాలకు వెళ్ళగా... ఇప్పుడు ఆ బాధ్యతలను చంద్రబాబు నిర్వర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళడంతో చంద్రబాబు...

సచిన్ వారసుడు భయపడుతున్నాడా?

క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ పై తొలి నుంచి అందరి ద్రుష్టి పడింది. అర్జున్ చిన్నప్పటినుంచి క్రికెట్ ప్రపంచానికి తెలుసు. తండ్రి బాటలోనే తను కూడా క్రికెట్ ఆటనే కెరీర్...

బీఆర్ఎస్ మాజీ మంత్రి అరెస్ట్..!!

మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ల్యాండ్ ను కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అక్కడికి వెళ్లి నానా హంగామా చేశారు. మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close