జగన్పై కోడికత్తితో దాడి చేసిన జనపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ను కోర్టు ఏడో సారి కొట్టి వేసింది. ఆయన నాలుగేళ్లు దాటి జైలులోనే ఉన్నారు. హత్యలు చేసి డోర్ డెలివరీ చేసి. ఆ నేరాన్ని అంగీకరించిన వారికి కూడా బెయిల్ వచ్చింది. అంత కంటే తీవ్రమైన నేరాలు చేసిన వారికీ బెయిల్ వచ్చింది. కానీ జనపల్లి శ్రీనివసరావు మాత్రం జైల్లోనే మగ్గిపోతున్నారు. ఆయన తల్లి బెయిల్ ఇప్పించాలని జగన్ వేడుకుంటున్నారు. కానీ పట్టించుకుంటున్న దిక్కులేదు.
నిజానికి జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఎప్పుడో వచ్చింది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఎన్ఐఏ కోర్టు బెయిలిచ్చింది. కానీ బెయిల్ రద్దు చేయించాలని ప్రభుత్వం వైపు నుంచి సూచన రావడంతో ఎన్ఐఏ హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు హైకోర్టుకు వెళ్లి ఎన్ఐఏ బెయిల్ రద్దు చేయించింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు బెయిల్ ఇచ్చినా ఇబ్బంది లేదని ఓ లేఖ ఇస్తే ఎన్ఐఏ బెయిల్ వచ్చేలా చూస్తుందని అనుకున్నారు. కానీ అలాంటి లేఖ ప్రభుత్వం నుంచి రావడం లేదు. జనపల్లి శ్రీనివాస్ జైలు నుంచి విడుదల కావడంలేదు.
జనపల్లి శ్రీనివాస్ .. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. ఆయన జగన్ అభిమాని. జగన్ కు సానుభూతి వెల్లువెత్తాలని ఇదంతా చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఎన్ఐఏ చార్జిషీటులోనూ అదే చెప్పింది. హాని చేయాలని పిసరంత కూడా లేదని చెప్పుకున్నారు. ఆ కోడి కత్తి తో గిసిన గాయాన్ని తొమ్మిది కుట్లుగా మార్చుకుని జగన్ చాలా రాజకీయం చేసి కావాల్సినంత సానుభూతి పొందారు. కానీ దీనికి కారణమైన శ్రీనివాస్ మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు.