`కాంతార‌` సీక్వెల్ కాదు… ప్రీక్వెల్

2022లో ద‌క్షిణాది చూసిన అతి పెద్ద విజ‌యాల్లో `కాంతార‌` ఒక‌టి. క‌న్న‌డ సినిమా వైభ‌వానికి `కాంతార‌` ప్ర‌తీక‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు భారీ లాభాలు అందించింది. అప్ప‌టి నుంచి `కాంతార 2` కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. కాంతారా 2కి ఇంకా టైమ్ ఉందంటూ రిష‌బ్ శెట్టి చెబుతూనే వ‌చ్చాడు. 2023లో కాంతార 2 రాద‌ని చాలామంది ఫిక్స‌యిపోయారు. అయితే రిష‌బ్ ఇప్పుడు అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకొన్నాడు. త‌న సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టి `కాంతార 2`ని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడ‌ని టాక్‌. అయితే ఇది `కాంతార‌`కి సీక్వెల కాదు.. ప్రీక్వెల్‌. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైందని, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని క‌న్న‌డ సినీ వ‌ర్గాల టాక్‌. కాంతార‌లో క‌నిపించిన న‌టీన‌టులే.. ఈ ప్రీక్వెల్‌లోనూ క‌నిపించ‌నున్నారు. ఇంకొన్ని కొత్త పాత్ర‌లు భాగం పంచుకోనున్నాయి.ప్ర‌పంచ వ్యాప్తంగా కాంతార 300 కోట్లు వ‌సూలు చేసింది. అయితే దాని బ‌డ్జెట్ రూ.20 కోట్ల లోపే. పార్ట్ 2కి కావ‌ల్సినంత బ‌డ్జెట్ కేటాయించే అవ‌కాశం ఉంది. కాక‌పోతే.. మ‌రీ ఎక్కువ హంగులు, ఆడంబ‌రాల‌కు పోకుండా `కాంతార‌`ని ప‌రిమిత బ‌డ్జెట్ లో ఎలా తెర‌కెక్కించారో.. పార్ట్ 2కి కూడా అలానే తీయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ యేడాది జూన్ – జులైల‌లో ఈ ప్రీక్వెల్ ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close