ఆస్కార్‌కి ఒక్క అడుగు దూరంలో ‘నాటు నాటు’

తెలుగు సినిమా క‌ల ‘ఆస్కార్‌’ ఫ‌లించ‌డానికి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఒక్క అడుగు దూరంలో ఉంది. బెస్ట్ వ‌ర్జిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. షార్ట్ లిస్టులో చోటు చేసుకొన్న పాట‌ల్ని మ‌ళ్లీ ఒడ‌బోసి.. నాలుగు పాట‌లతో తుది జాబితా సిద్ధం చేసింది ఆస్కార్‌. ఆ నాలుగు పాట‌ల్లో… ‘నాటు నాటు’కు చోటు ద‌క్కింది. ఇటీవ‌లే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సైతం నాటు నాటు పాట ద‌క్కించుకొన్న సంగ‌తి తెలిసిందే. గోల్డెన్ గ్లోమ్ మినీ ఆస్కార్ లాంటిది. అక్క‌డ అవార్డు గెలుచుకొన్న పాట‌ల‌కు ఆస్కార్ రావ‌డం దాదాపుగా గ్యారెంటీ. అందుకే ఆస్కార్ నామినేష‌న్‌ల‌లో నాటు నాటుకి చోటు దొరుకుతుంద‌ని అంతా ఆశించారు. అనుకొన్న‌ట్టే.. ఆస్కార్ క‌మిటీ నాటు నాటు పాట‌ని నామినేష‌న్‌ల‌లో ఎంపిక చేసింది. మార్చి 23న జ‌రిగే అవార్డు ప్ర‌దానోత్స‌వంలో విజేత ఎవ‌రో తెలిసిపోతుంది. కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచిన ఈ గీతాన్ని చంద్ర‌బోస్ రాశారు. ప్రేమ్ ర‌క్షిత్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు.

* ఎన్టీఆర్ అభిమానుల‌కు నిరాశ‌

ఆస్కార్‌లో ఉత్త‌మ న‌టుడి పుర‌స్కారం కోసం ఎన్టీఆర్ సైతం పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్‌ల‌లో ఎన్టీఆర్ పేరు త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని అంతా భావించారు. అయితే… నామినేష‌న్‌ల‌కు ఎన్టీఆర్ అర్హ‌త సాధించ‌లేక‌పోయాడు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరిల‌లో కూడా `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కి చోటు ద‌క్క‌లేదు. నాటు నాటు పాట తుది జాబితాలో నిల‌వ‌డం ఒక్క‌టే తెలుగు వాళ్లుగా గ‌ర్వించ‌ద‌గిన విష‌యం. ఆ ఆస్కార్ కూడా అందేస్తే… ఆర్‌.ఆర్‌.ఆర్ పేరు మ‌రోసారి మార్మోగిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close