ఏపీ జీవోల కథ : ఒకటి కోర్టు కొట్టేసింది..ఇంకోటి ప్రభుత్వమే రద్దు చేసుకుంది !

ఏపీ ప్రభుత్వం జారీ చేసే జీవోల్లో ఎన్ని పని చేస్తాయో .. ఎన్ని రాజ్యాంగ బద్దంగా ఉంటాయో.. చెప్పడం కష్టం. అనేక జీవోలను కోర్టు కొట్టి వేస్తే.. కొన్ని జీవోలను ప్రభుత్వం తనకు తానే రద్దు చేసుకుంటూ ఉంటుంది. అలా రెండు జీవోలకు ఈ రోజు అదేగతి పట్టింది. అందులో ఒకటి ఫ్లెక్సీ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు పక్కన పెట్టగా.. రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఐదు శాతం పేదలకివ్వాలంటూ గతంలో తాను ఇచ్చిన జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది.

విశాఖ బీచ్‌లో ప్లాస్టిక్ ఎరేసేందుకు ఓ ప్రైవేటు సంస్థ పెట్టుకున్న కార్యక్రమానికి అతిథిగా హాజరైన జగన్…అక్కడ ప్రసంగిస్తూ.. తన స్టైల్లో ..అంటే ప్రమాణ స్వీకారం రోజున.. కరెంట్ బిల్లులన్నీ తగ్గించి పడేస్తానని రెండు చేతులు పైకి ఎత్తి… అడ్డంగా కిందకి కోసేసిన బాడీ లాంగ్వేజ్‌లోనే ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఫ్లెక్స్ ల మీద ఆధారపడి బతుకుతున్న వారి గుండెల్లో రాయి పడినట్లయింది.

ఆ రోజు నుంచే బ్యాన్ అమల్లోకి వస్తుందని చెప్పిన సీఎం .. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 26నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కానీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆ జీవో చెల్లదని.. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలు ఉంటే.. వాటిపైనే నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది. అసలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదని.. సింగిల్ యూజ్ కానే కాదని వ్యాపారులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అంటే.. ఫ్లెక్సీలపై బ్యాన్ లేనట్లేనన్నమాట.

ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే 5 శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల‌ని గతంలో జీవో ఇచ్చారు. స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని జీవోలో పేర్కొన్నారు. అంటే ప్ర‌తి వెంచ‌ర్ లో 10 శాతం సామాజిక అవ‌స‌రా ల కోసం కేటాయిస్తోన్న దానికి అద‌నంగా మ‌రో 5 శాతం స్థ‌లం వ‌ద‌లాల్సి ఉంది. అయితే ఇది చట్ట విరద్ధమని.. చాలా మంది కోర్టుకెళ్లారు. చివరికి తానే జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నాలుగేళ్ల కాలంలో అసలు నిబంధనలు అనుగుణంగా ఉన్న జీవోల లెక్క తీస్తే.. మచ్చుకు కొన్ని కూడా కనిపించవేమో. అందుకే అన్నీ రహస్యంగా ఉంచుకున్నారు. ప్రభుత్వం మారితేనే వీటి కథ బయటకు తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close