ఆర్కే పలుకు : మరోసారి కేసీఆరేనని భరోసా !

తెలంగాణలో మరోసారి కేసీఆరే గెలవబోతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కొత్త పలుకులో తేల్చేశారు గతంలో ఎప్పుడూ ఇంత పాజిటి వ్ గా రాయలేదు. కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని…. ఆయన సీఎం కాలేరన్నట్లుగా రాసేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్వరం మారింది. దీనికి కారణం కూడా ఆయన చెబుతున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు.. బలపడుతున్నాయి కానీ… కేసీఆర్ ను ఓడించేంత కాదు. మూడు పార్టీల పోరులో ఓట్లు చీలిపోయి కేసీఆర్ విజయం సాదించబోతున్నారని ఆర్కే చెబుతున్నారు.

తన ఆర్టికల్‌లో బీజేపీ ఎందుకు ఎదగలేకపోతోందో చెప్పుకొచ్చారు. ఓ రకంగా ఆయన తన ఆర్టికల్ ద్వారా బీజేపీకి సలహాలిచ్చారని అనుకోవచ్చు. కానీ ఆర్కే ఆర్టికల్ బీజేపీ హైకమాండ్ వరకూ వెళ్లదు. ఈ ఆర్టికల్‌లో తెలంగాణ బీజేపీ నేతలకు ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పారు. ఎంత పెద్ద నేత అయిన తమకు టిక్కెట్ ఖరారు చేసుకోలేరని.. . మరొకరికి ఇప్పించలేరని తేల్చారు అంటే ఎలాంటి నిర్ణయాదికారం లేదన్న మాట. అలాంటప్పుడు.. ఎన్ని సలహాలు తన ఆర్టికల్ ద్వారా ఇచ్చినా వారు చేయగలిగిందేమీ లేదు.

అదే సమయంలో రేవంత్ రెడ్డిపై ఆయన కాస్త పాజిటివ్ గా స్పందించారు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని ప్రజలు చూస్తున్నారని ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. నిజానికి రేవంత్ పాదయాత్ర సాగుతున్న విధం మీడియా ఫోకస్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ కి ఫేవర్ గా రాజకీయం మారి ఉండేది. కానీ పది మంది కూడా ఉండని మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు మీడియా ఇస్తున్న కవరేజీ అంత కూడా రేవంత్ పాదయాత్రకు ఇవ్వడం లేదు. అందుకే కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ గెలిచేంత కాదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆర్కే కూడా అదే చేశారు.

ఆర్కే ఈ సారి ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించలేదు. తెలంగామ బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన గురించే అన్నీ విశ్లేషించుకున్నారు. కేసీఆర్ కు భరోసా కల్పించే మాటలు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close