పోర్ట్ బ్లెయిర్ పొత్తు ఏపీకి వస్తుందా ?

అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుతో ఈ పదవి దక్కింది. ఇది గొప్ప ముందడుగు అన్నట్లుగా జేపీ నడ్డా.. టీడీపీ, బీజేపీ అలయన్స్ గురించి పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయింది. నిజానికి పోర్టు బ్లెయిర్‌లో ఇప్పుడు ఎన్నికలు జరగలేదు. రెండున్నరేళ్ల కిందట జరిగాయి. అప్పట్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. విడివిడిగా పోటీ చేసాయి. టీడీపీ రెండుస్థానాల్లో గెలిచింది. ఆ రెండు స్థానాలే మేయర్ పీఠాన్ని ఎవరికి దక్కాలో డిసైడ్ చేస్తున్నాయి.

అప్పట్లో బీజేపీ నేతలు టీడీపీతో సంప్రదింపులు జరిపి పొత్తు కోసం అంగీకరింపచేశారు. దానిప్రకారం… మొదట బీజేపీ.. తర్వాత టీడీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. మొదట బీజేపీ తీసుకుంది. వారి టర్మ్ అయిపోయిన తర్వాత పద్దతిగా టీడీపీకి అప్పచెప్పింది. టీడీపీకి ఉన్న ఇద్దరు కౌన్సిలర్లు ఇతర పార్టీలు ఎంత ప్రలోభ పెట్టినా లొంగలేదు. ఆ ఇద్దర్నీ చేర్చేసుకుంటే పదవి ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా అని బీజేపీ ఆలోచించి కార్యాచరణ ఖరారు చేసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. టీడీపీ, బీజేపీ పొత్తు అనే అభిప్రాయాన్ని కల్పించడానికి .. .మాత్రం నడ్డా ఈ విషయాన్ని హైలెట్ చేశారు.

టీడీపీ అంటే తెలుగు రాష్ట్రాలు అనే చూస్తారు. అండమాన్‌లో టీడీపీ ఉనికి ఆ పార్టీ నాయకత్వానికే తెలుసు. అలాంటిది నడ్డా ఇప్పుడు… టీడీపీ అండమాన్ లోనూ ఉందని జాతీయ స్థాయిలో చూపించడమే కాదు.. తాము టీడీపీతో పొత్తులో ఉన్నామనట్లగా సందేశం పంపారు. అండమాన్ లో కలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కలవకూడదని ఆయన సందేశం ఇచ్చారేమో కానీ ముందు ముందు పరిస్థితులు మరింత మారిపోయే అవకాశం ఉంది. పోర్టు బ్లెయిర్ నుంచి పొత్తు.. ఏపీకి వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన అందుకే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close