“హోదా”పై కుట్రతోనే పార్లమెంట్‌లో వైసీపీ ప్రశ్నలు !

వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సెషన్ ఎప్పుడు జరిగినా ఓ ప్రశ్న ఖచ్చితంగా వేస్తారు. అదేమిటంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తారా అని. కానీ కేంద్రం మాత్రం నిర్మోహమాటంగా ఇచ్చేది లేదని చెబుతూ ఉటుంది. తాజాగా మరోసారి అదే సమాధానం ఇచ్చింది. కానీ వైసీపీ ఎంపీలు నోరెత్తితే ఒట్టు. ప్రతీ సారి అంతే. అటు ఎంపీలు నోరెత్తలు. ఇటు ప్రభుత్వం … మెడలు వంచుతానన్న ప్రభుత్వ పెద్ద కూడా సైలెంట్‌గా ఉంటారు. ప్రతీ సారి ఇదే తంతు. ఎందుకు అంటే ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడానికి.,

గత ఎన్నికలకు ముందు ఆడిన హోదా డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. పెయిడ్ ఆర్టిస్టులతో ఇష్టారితీన మాట్లాడించి… ప్రత్యేకహోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని… ప్రకటించారు. ఇన్ కం ట్యాక్స్ ఉండదనికూడా చెప్పుకొచ్చారు. పాతిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఏ ఎల్లయ్య.. పుల్లయ్య ఉన్నా మెడలు వంచి తెస్తామని జగన్ పెద్ద పెద్దడైలాగులు కొట్టారు. నాలుగేళ్లయినా కనీసం నోరెత్తే సాహసం చేయకపోగా… ప్రత్యేకహోదా రాదని పదే పదే చెప్పిస్తున్నారు.

మాటకంటే ముందే బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని చెబుతూంటారు. కానీ వైసీపీ అవసరం ఎన్నో సార్లు వచ్చింది బీజేపీకి. అలా వచ్చినప్పుడల్లా వ్యక్తిగత అవసరాల కండిషన్లు పెట్టారు కానీ రాష్ట్రం కోసం పెట్టలేదు. ఫలితంగా రాష్ట్రం అన్యాయమైపోయింది. హోదా పోయింది. ఇంకా చెప్పాలంటే.. తము హోదాను లైవ్ లో ఉంచుతున్నామని చెబుతూంటారు. సజీవంగా ఉందంటే అది మా గొప్పే అంటూంటారు. బహుశా… గొడ్డలి వేటు వేయలేదని సంతోషపడండి అని చెప్పడమే ఉద్దేశమేమో. కారణం ఏదైనా హోదా విషయంలో ప్రజల్ని అత్యంత దారుణంగా మోసం చేసిన ముద్ర మాత్రం వైసీపీపై పడిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close