“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముఖ ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం ఆహా నష్టాలు రూ. 92 కోట్లు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ నష్టాలు కేవలం రూ. 26 కోట్లకు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అనూహ్యంగా ఈ ఏడాది నష్టాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇదే సమయంలో ఆహా మంచి పనితీరు కనబర్చింది. ఆపరేటింగ్ రెవిన్యూ రూ. 26 కోట్ల నుంచి రూ. 76 కోట్లకు పెరిగింది. కానీ ఖర్చుల్లో అదుపు లేకపోవడంతో ఆదాయాన్ని మించి నష్టాలు చూడాల్సి వచ్చింది.

మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఖర్చు రూ. 200 కోట్లకు చేరింది. ఈ ఖర్చులో అత్యధికంగా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్ పెన్సెస్‌ కింద అత్యధికంగా రూ.74 కోట్లు ఖర్చు చూపించారు. అంటే ఉద్యోగుల కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్లుగా అర్థమవుతుంది. కంటెంట్ ఇతర సాంకేతిక అంశాలపై రూ. 109 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క కంటెంట్ కోసం ఇందులో రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఆహాకు లభిస్తున్న అత్యధిక ఆదాయం సబ్ స్క్రిప్షన్స్ మీదనే వస్తోంది. మొత్తంగా ఆహాకు వచ్చిన ఆదాయం రూ. 76 కోట్లలో రూ. 68 కోట్ల వరకూ చందదారుల కారణంగానే వచ్చింది. ఇతర ఆదాయాల సోర్స్ పరిమితంగానే ఉంది. శాటిలైట్ రైట్స్ అమ్మడం ద్వారా రూ. ఐదున్నర కోట్లు, మరో రెండున్నర కోట్లు సిండికేషన్ రెవిన్యూ ద్వారా వచ్చాయి. ఆహా ఫ్లాట్ ఫామ్ తెలుగులో రిజినల్ లాంగ్వేజ్‌లో బాగా పట్టు సాధించింది. ఇటీవల తమిళంలోనూ ప్రారంభించడంతో ఖర్చులు పెరిగాయి.

గీతా ఆర్ట్స్, మైహోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. ఓటీటీ మార్కెట్ ఇప్పుడే పుంజుకుంటూడటంతో పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని ఆహా యాజమాన్యం నమ్మకంతో ఉంది. కొత్త సీఈవోగా రవికాంత్ సబ్నవిస్‌ను నియమించారు. ఇప్పటి వరకూ సీఈవోగా ఉన్న అజిత్ ఠాకూర్‌ను డైరక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. రవికాంత్ స్టార్ టీవీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి ప్రముఖ సంస్థల్లో పని చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close