చైతన్య : “క్రూర హంతకుల్ని” కాపాడితే వ్యవస్థల్ని ప్రజలు నమ్ముతారా ?

దేశంలో వ్యవస్థలు అధికారంలో ఉన్న పెద్దల ఒత్తిడికి తలొగ్గి నేరస్తుల్ని కాపడటానికి పరుగులు పెడుతున్న వైనం ప్రజల్ని విస్మయానికి గురి చేసే పరిస్థితులు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా అవినీతి కేసులు కానీ ఇప్పుడు అనూహ్యంగా హత్య కేసుల నిందితులు కూడా అధికార బలంతో తప్పించుకుంటున్నారు. వ్యవస్థలోని లోపాల్ని ఉపయోగించుకుంటూ అడ్డగోలుగా బరితెగిస్తున్నారు. వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు ప్రజల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. అధికారం, డబ్బు ఉన్న వాళ్లు ఏది చేసినా చెల్లుతుందానే నిస్పృహ ప్రజల్లో పెరిగే ప్రమాదం ఏర్పడుతోంది.

వివేకానందరెడ్డి హత్య కేసు చేధించలేనంత క్లిష్టమైనదా ?

ఏ క్లూ దొరకని మర్డర్ కేసుల్ని పోలీసులు వారం, పది రోజుల్లో చేధిస్తారు. కానీ అడ్డగోలుగా నరికేసినట్లుగా స్వయంగా ఆధారాలను నిందితులే ఇచ్చినా వివేకా హత్య కేసులో ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నాలుగేళ్లవుతోంది. న్యాయం కోసం వివేకా కుమార్తె ఎక్కని కోర్టు లేదు. కానీ న్యాయం కోసం పోరాడుతున్న ఆమెపైనే రివర్స్‌లో ఆరోపణలు చేస్తూ… గడుసుతనం ప్రదర్శిస్తూ.. న్యాయవ్యవస్థలోని లోపాల్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆటతో… ఓదో ఇదా మన వ్యవస్థ అని ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.

నిందితుడు అడిగితే దర్యాప్తు అధికారిని మార్చేస్తారా ?

సీబీఐ అధికారి రాంసింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొని ఈ కేసు విచారణ చేస్తున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. దేశంలో ఎవరూ చేయనంత సాహసం… సీబీఐ అధికారిపైనే తిరిగి కేసు పెట్టడం వంటివి చేశారు. ఆయనపై ఆరోపణలు చేశారు. ఫిర్యాదులు చేశారు. ఇవన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం పట్టించుకోలేదు. ఆయనను తప్పించాల్సిందేనని పట్టు బట్టింది. ఓ హత్యకేసు దర్యాప్తులో అధికారిని మధ్యలో మార్చాలని అత్యున్నత న్యాయస్థానం ఎందుకు పట్టుబట్టిందో సామాన్య జనానికి అర్థం కావడం లేదు. విచారణ ఆలస్యం అనేది అసలు కారణం కానే కాదు.. ఎందుకంటే.. పక్కన సీఎంజగన్ కేసులు పధ్నాలుగేళ్లుగా ఇంకా ట్రయల్ కూడా ప్రారంభం కాకుండా పడి ఉన్నాయి. ఆ కేసుల విచారణలో ఎందుకు కనిపించలేదు ఈ తొందరు.

న్యాయం చేయడమే కాదు.. చేసినట్లుగా కనిపించాలి కూడా !

వివేకా కేసు విచారణను హైదరాబాద్‌కు మారుస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయం చేయడమే కాదు.. చేసినట్లుగా కనిపించాలి కూడా అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు దాన్ని నిజం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడో రేపో సూత్రధారి, పాత్రధారి అరెస్టవుతారని అనుకుంటున్న సమయంలో దర్యాప్తు అధికారిని మార్చేశారు. ఇప్పుడు ఆ కేసు తేలుతుందని ఎవరూ నమ్మకం పెట్టుకోవడం లేదు. నిట్టూరుస్తున్నారు. ఇది ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి కల్పిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close