బీఆర్ఎస్‌తో పొత్తు కోసం మళ్లీ కాంగ్రెస్ సీనియర్ల బ్యాటింగ్ !

కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించాల్సిన పని లేదు. వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు. కాస్త పుంజుకుంటోంది అనుకుంటున్న సమయంలో సీనియర్లు తెరపైకి వచ్చేస్తారు. బీఆర్ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడేస్తారు. అసలు పోరాడుతోంది బీఆర్ఎస్‌తో అయితే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఆ పార్టీతో పొత్తుల గురించి మాట్లాడతారా.. ? కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడతారు. వారికి కావాల్సింది కాంగ్రెస్ గెలవడమా.. బీఆర్ఎస్ గెలవడమా అన్నది సీక్రెట్‌గానే ఉంచుతారు. కాంగ్రెస్ ను వీలైనంత డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు.

చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జానారెడ్డి తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యనించేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచిందని.. అదే పొత్తుకు ప్రాతిపదిక అన్నట్లుగా మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులు ఉండే అవకాశం ఉందని.. పెట్టుకోక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఓ సారి చేసిన వ్యాఖ్యలపై నేతలు భగ్గుమన్నారు. తర్వాత అది సద్దుమణిగింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోరుకుంటున్నారని కొంత కాలంంగా ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇతర సీనియర్లు మాత్రం భిన్నమైన రాజకీయంతో వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్‌లో కొత్త అలజడికి కారణం అవుతోంది. ఎదుర్కోవాల్సిన పార్టీతో పొత్తులని ప్రచారం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని తెలిసినా సీనియర్లు తగ్గడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close