వైసీపీ నేత గెదెల శ్రీనుబాబుపై ఈడీ దృష్టి !

2019కి ముందు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన గేదెల శ్రీనుబాబు తర్వాత పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరారు. ఆయన కంపెనీలపై ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. పల్సెస్ గ్రూపుకు సీఈవోగా వ్యవహరిస్తున్న గేదెల శీనుబాబు యువతకు శిక్షణ ఇస్తామని..అంతర్జాతీయ పరిశోధకుల ద్వారా వివరాలు తెలుసుకుని ఫార్మా జర్నల్స్‌ను ప్రచురిస్తున్నామని చెుబతూంటారు.

విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న కార్యాలయాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ టీమ్ సోదాలు నిర్వహిస్తోంది.పల్సెస్ కంపెనీలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. పరిశోధనాత్మక ఆర్టికల్స్ పత్రికలకు అమ్ముతూ ఉంటాయి. కానీ పరిశోధన మాత్రం ఆ ఆర్టికల్స్‌లో ఉండదు. ఎలాంటి పరిశోధనల్లేకుండా… కనీస పరిశీలన లేకుండా.. ప్రముఖ పరిశోధకుల పేర్లు వాడుకుని… ఆరోగ్య , సామాజిక రంగంలో ఫేక్ రిపోర్టులను సృష్టిస్తూ అమ్ముకుని.. కేసుల పాలయిన వ్యక్తి ఈ శ్రీనుబాబు గేదెల. అమెరికాతో పాటు పలు దేశాల్లో ఆయనపై కేసులున్నాయి.

వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు పంపుతున్న ఆర్టికల్స్.. అమ్ముతున్న రీసెర్చ్ పత్రాలు.. అన్నీ ఫేక్ . సదస్సులు, సింపోజియన్స్, వర్క్ షాప్స్ లాంటివి ఏవీ నిర్వహించదు. కానీ ఆయా దేశాల్లోని ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లను కోట్ చేస్తూ పరిశోధన పత్రాలు మాత్రం రూపొందించారు. నిజం తెలుసుకుని ఆయా దేశాల్లోని అధికార వర్గాలకు ఫిర్యాదు చేశాయి. “అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్” నెవడా డిస్ట్రిక్ కోర్టులో కేసు పెట్టింది. మెడికల్, సైన్స్ రంగాల్లో … ఓమిక్స్ అమ్మిన ఆర్టికల్స్అన్నీ ఫేక్ అని… ఆయా ఆర్టికల్స్ లో ఉదహరించిన నిపుణులు అందరూ తమకు సంబంధం లేదని తేల్చినట్లుగా..అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్” ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో ఫైన్ కూడా విధించారు.

అంతర్జాతీయంగా కేసులు నమోదు అయినా.. ఫేక్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నా.. ఇండియాలో మాత్రం ఆయన ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారు. అయితే ఇటీవల ఆయన వైసీపీ నేతలకు బాగా దగ్గరయ్యారు. వారికి సంబంధించిన డబ్బులేమైనా మనీలాండరింగ్ చేస్తున్నారో లేదో ఈడీ తేల్చాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close