సస్పెన్స్ కోసం ఇంత రిస్కా రావణాసుర ?

థ్రిల్లర్స్ సినిమా చూడటడానికి ఆసక్తికరంగా వుంటాయి. అయితే ఆ థ్రిల్ ని హోల్డ్ చేయడం ఎంత కష్టమో.. స్పాయిలర్స్ బయటికిరాకుండా చూసుకోవడం కూడా అంతే కష్టం. ఈ జోనర్ తో మరో ఇబ్బంది.. ఒక్కసారి సస్పెన్స్ వీడిపోయిన తర్వాత ఆడియన్స్ రిపీట్ అవ్వరు. ఎలాంటి క్లూ లేకుండా మొదటిసారి, అదీ మొదటి షో చూడటంలోనే థ్రిల్లర్స్ మజా.

ఇప్పుడు రవితేజ రావణాసుర కూడా థ్రిల్లర్ గావస్తోంది. ఇప్పటివరకూ సస్పెన్స్ ని బాగానే హోల్డ్ చేశారు. ఇదంతా కేలవం మొదటి రోజు మొదటి ఆట చూసే ప్రేక్షకుల కోసమే. ఈ సోషల్ మీడియా యుగంలో తొలి ఆట అయిన వెంటనే ఎదో రూపంలో మలుపులు, సస్పెన్స్ బయటికి వచ్చేస్తాయి.

అయితే ఆ మొదటి ఆట థ్రిల్ కోసం రావణాసుర నిర్మాతలు పెద్ద రిస్క్ చేశారు. దిని కోసం ఏకంగా మిగతా భాషల విడుదల కూడా ఆపుకున్నారు. ఇలాంటి జోనర్ సినిమాలకి అన్ని భాషల్లో మార్కెట్ వుంటుంది. కానీ రావణాసుర ఆ ఛాన్స్ తీసుకోలేదు. దీనికి కారణం.. సస్పెన్స్ వీడిపోతుందని. ఈ విషయాన్ని దర్శకుడు సుధీర్ వర్మ స్వయంగా చెప్పారు. ”హిందీ, తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. తెలుగు ఆడియన్స్ మేము పొందిన ఎక్సయిట్ మెంట్ పొందాలి” అని చెప్పుకొచ్చారు.
మరి సస్పెన్స్ ని రివిల్ చేయొద్దని చూసిన ప్రేక్షకులకు చెబుతారా ? అనే ప్రశ్నకు.. మనం చెబితే వింటారా ? అలా అయితే వాళ్ళని బుజ్జగించిమరీ చెబుతాను” అని నవ్వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూ. 14 వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తారా ? లేదా ?

పోలింగ్ ముగిసింది. ఇప్పుడు గత ఆరు నెలలకు ఏపీ ప్రజలకు ఆపిన పథకాల డబ్బులను ఏపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలింగ్ కు మందు...

అన్నీ తెలుసు కానీ ఈసీ చూడటానికే పరిమితం !

దాడులపై ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు సమాచారం ఉందని సీఈవో మఖేష్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు. మరి ఎందుకు ఆపలేకపోయారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేకపోయారు. వైసీపీ ఎన్నికల్లో గెలవడానికి ఎంచుకున్న మార్గం.. దాడులు,...

ద్వేషం స్థాయికి వ్యతిరేకత – జగన్ చేసుకున్నదే!

ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత ఉంటుంది. అది సహజం. కానీ ద్వేషంగా మారకూడదు. మారకుండా చూసుకోవాల్సింది పాలకుడే. కానీ పాలకుడి వికృత మనస్థత్వం కారణంగా ప్రతి ఒక్కరిని తూలనాడి.. తన ఈగో ...

పల్నాడులో దెబ్బకు దెబ్బ – వైసీపీ ఊహించనిదే !

పల్నాడులో పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఉదయం కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరిగినా.. తమకు తేడా కొడుతుందని అంచనాకు రావడంతో మధ్యాహ్నం నుంచివైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close