చర్యలు ఖాయమని కేసీఆర్‌కు పరోక్ష వార్నింగ్ ఇచ్చిన మోదీ !

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ ను నేరుగా విమర్శించలేదు కానీ.. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అవినీతిపై చర్యలు ఖాయమని మోదీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదిక నుంచి హెచ్చరించారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా వద్దా అని పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రధాని మోదీ ప్రజలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా నేరుగా బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదన్నాకుయ అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రశ్నించారు.

అవినీతిపై పోరాడుతున్న తమపై దాడి చేయానికి అవినీతి పరులంతా కలిసి కోర్టుకు వెల్లారన్నారు. కానీ వారికి కోర్టు లెంపకాయ కొట్టిందన్నారు. రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోవడంతో ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయి.తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పాలకులు..ప్రతి ప్రాజెక్ట్ లో తన కుటుంబం స్వార్థం చూస్తున్నారన్నారు. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని.. అదే తన బాధ, ఆవేదన అన్నారు మోడీ. మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై పోరాడాలా వద్దా.. అవినీతిని తరిమి కొట్టాలా వద్దా.. తెలంగాణ ప్రజలు చెప్పాలంటూ పిలుపునిచ్చారు మోడీ. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని మోడీ కోరారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ, తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించామని ప్రధాని మోడీ అన్నారు. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామని అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో మోడీ పాల్గొన్నారు. సోదరి సోదరిమణులకు అంటూ తెలుగులో స్పీచ్ ను స్టార్ట్ చేశారు మోడీ. తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 70 కీమీ మెట్రో నెట్ వర్క్ నిర్మించామని తెలిపారు. తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను స్టార్ట్ చేస్తున్నామని మోడీ తెలిపారు.

అధికారిక సభ కావడంతో సభా వేదికపై సీఎం కేసీఆర్ కు.. స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీలు వేశారు. కానీ వారు హాజరు కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close