పాపం… వినాయ‌క్‌

వినాయ‌క్ మంచి టెక్నీషియ‌న్‌. ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం లేదు. రాజ‌మౌళిలా.. హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌గ‌ల‌డు. బోయ‌పాటిలా ఎమోష‌న్ పండించ‌గ‌ల‌డు.శ్రీ‌నువైట్ల‌లా ఫ‌న్ తీసుకురాగ‌ల‌డు. కాక‌పోతే.. ఒక్క‌టే స‌మ‌స్య‌. త‌న క‌థ‌ల్ని తాను త‌యారు చేసుకోలేడు. అదే త‌న బ‌ల‌హీత‌న‌. అందుకే చాలా కాలంగా వినాయ‌క్ సినిమాలు చేయ‌డం లేదు. ఇప్పుడు తీస్తున్న ఛ‌త్ర‌ప‌తి కూడా రీమేకే. క‌థ‌లు త‌యారు చేసుకోలేక‌పోవ‌డం వ‌ల్లే.. ఇప్పుడు త‌న‌కు అవ‌కాశాలు దూరం అవుతున్నాయి.

బాల‌కృష్ణ‌తో వినాయ‌క్ సినిమా ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉంది. సి.క‌ల్యాణ్ దీనికి నిర్మాత‌. బాల‌య్య కోసం ఎన్ని క‌థ‌లు సెట్ చేయాల‌ని చూసినా కుద‌ర‌డం లేదు. వినాయ‌క్‌కి మాస్ ప‌ల్స్ తెలుసు. బాల‌య్య‌కు ఎలాంటి క‌థ కావాలో కూడా తెలుసు. కానీ తాను త‌యారు చేసుకోలేడు. అలాంటి క‌థ‌లు చేసే ర‌చయిత‌లు ఇప్పుడు ద‌ర్శ‌కులుగా మారిపోయారు. దాంతో బాల‌య్య ద‌గ్గ‌ర‌కు క‌థ తీసుకెళ్ల‌లేక‌పోయాడు. చిరంజీవి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. వినాయ‌క్ తో చిరంజీవి ఓ సినిమా చేయాల్సివుంది. `క‌థ త‌యారు చేసుకో.. సినిమా చేద్దాం` అని చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కానీ వినాయ‌క్ మాత్రం చిరుకి త‌గిన క‌థ వెద‌క‌డంలో విఫ‌లం అయ్యాడు. ఈమ‌ధ్య చిరు క‌థ కోసం తిరిగి తిరిగి వినాయ‌క్ అల‌సిపోయాడు. ఓ క‌థ సెట్ చేశాడు కానీ… చివ‌రికి ఆ ర‌చ‌యిత `ఈ క‌థ‌ని నేనే డైరెక్ట్ చేస్తా` అని అడ‌గ‌డంతో ఏం చేయ‌లేక‌పోయాడ‌ట వినాయ‌క్‌. ఇప్ప‌టి ట్రెండ్ అలానే ఉంది. క‌థ త‌యారు చేసుకొనేవాళ్లే.. ద‌ర్శ‌కులు. వేరే వాళ్ల క‌థ‌ని డైరెక్ట్ చేస్తానంటే.. హీరోలకు న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. అందుకే వినాయ‌క్ ఈ రేసులో వెనుక‌బ‌డిపోయాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close