అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలిచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు అసంతృప్తి !

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్ సునీత పిటిషన్‌పై విచారణలో సీజేఐ చంద్రచూడ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు అలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారని ఘాటుగానే ప్రశ్నించారు. హైకోర్టు ఇక అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మామూలుగా అయితే 25వ తేదీన ముందస్తు బెయిల్ విషయంలో తుది తీర్పు ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు.అప్పటి వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఆదేశాలు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయన్న విమర్శలు మొదటి నుంచి వచ్చాయి. న్యాయనిపుణులు కూడా ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు గడువు పెట్టిన తర్వాత కూడా ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చారని ఆశ్చర్యపోయారు. ఇదే విధమైన స్పందనను సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేశారు. హైకోర్టు తన ఆర్డర్‌లో సీబీఐపై అనేక ఆంక్షలు పెట్టింది. న్యాయవాది కనిపించేటట్టు విచారించండి .. రాతపూర్వక ప్రశ్నలు మాత్రమే ఇవ్వండి ..ఇలాంటి కండిషన్లు చాలా పెట్టింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టు పక్కన పెట్టేసినట్లయింది. అలాగే 25 వరకు రిలీఫ్ మీద కూడా స్టే విధించింది.

హైకోర్టు అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి తీసుకున్న కారణాలు పెట్టిన షరతులు ని చూసిన తర్వాత చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ ఇటువంటి ఆర్డర్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు ఈ ఆర్డర్ సరిగా లేదు అని వ్యాఖ్యానించారు. చివరి క్షణంలో అవినాష్ రెడ్డి లాయర్ లేచి మాకు అవతలి వారు పిటీషన్ లో ఏమి వేశారు అనేది మాకు తెలియదని.. సమయం ఇస్తే మా వాదనలు వినిపిస్తామని అడిగారు. దాంతో సోమవారం వాదనలు వినాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. అవినాష్ రెడ్డి ఇప్పుడు కూడా సిబిఐ ఆఫీస్ లోనే ఉన్నాడు సిబిఐ కి సహకరిస్తున్నాడు కాబట్టి 24 దాకా అరెస్టు చేయొద్దని కోర్టును కోరారు. సుప్రీంకోర్టు దాన్ని మన్నించి 24 వరకు అతని అరెస్టు చేయొద్దు అని మెన్షన్ చేశారు.

మొత్తంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులపై సామాన్య జనానికి వచ్చిన సందేహాలనే సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

కవిత బెయిల్ రిజెక్ట్ – ఇప్పుడల్లా కష్టమే !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టి వేసింది. గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా...

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close