మార్గదర్శిపై సీఐడీ కుట్రలు – బలయ్యేది ఎవరు ?

సీఐడీ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమయింది. మార్గదర్శి కేసులో ఆయనను ప్రశ్నిస్తామంటూ ఇంటికి వెళ్లి ఇంట్లోనే ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిలో కొన్ని రహస్యంగా కూడా తీశారు. అవన్నీ కాన్ఫిడెన్షియల్. కోర్టుకు సమర్పించాల్సినవి. విచారణ వీడియోలు. కానీ అవి సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. . మొదట కొన్ని పెయిడ్ అకౌంట్ల నుంచి వెలుగులోకి వచ్చాయి. తర్వాత వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. సీఐడీ అధికారులు ఇంత నీచంగా ఉన్నారేమిటని విమర్శలు ప్రారంభమయ్యాయి.

నైతికంగా సీఐడీ ఏస్థాయిలో ఉందో అందరికీ తెలుసు కానీ ఇది మ్యాటర్ ఆఫ్ జ్యూరిస్ డిక్షన్ అని. ఓ కేసు విషయంలో అనుమానితుల్ని ప్రశ్నించి రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు.. సేకరించిన సాక్ష్యాలు హైలీ కాన్ఫిడెన్షియల్.. బయటకు రాకూడదు. వస్తే దర్యాప్తు సంస్థదే బాధ్యత. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యాయవ్యవస్థను ఇది తక్కువ చేయడమేనని.. ఈ వీడియోలు మార్గదర్శి విచారణలో కీలకం అవుతాయన్న భావన వినిపిస్తోంది. మార్గదర్శిపై ఒక్క ఆరోపణ లేకుండా దర్యాప్తు చేసి బురదచల్లి… ఇళ్లల్లో కూడా సోదాలు చేసి… వీడియోలు తీసి బయటపెట్టడం అంటే.. చిన్న విషయం కాదంటున్నారు.

న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన తర్వాత ఆ వీడియోలను కొంత మంది తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. కానీ అలా డిలీట్ చేసినంత మాత్రాన.. తప్పు దిద్దుకుననట్లు అవుదు కదా. మొత్తం రికార్డెడ్ సాక్ష్యాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు.. సీఐడీ చీఫ్ కూడా కేసుల్లో ఇరుక్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో ముందు ముందు క్లారిటీ రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close