పులిని వేటాడే పులి వ‌చ్చింది

స్టువ‌ర్టుపురం… దొంగ‌ల‌కు అడ్డా. ఒక‌ప్పుడు ద‌క్షిణాదికి ఇది నేర రాజ‌ధాని. అక్క‌డ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే ఓ గ‌జ‌దొంగ ఉండేవాడు. త‌న గురించి చ‌రిత్ర క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుంది. ఇప్పుడు వాటినే వెండి తెర‌పై `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` సినిమాగా రూపొందిస్తున్నారు. ర‌వితేజ న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. వంశీ ద‌ర్శ‌కుడు. ఫస్ట్ లుక్‌తో పాటు.. గ్లిమ్స్ ఈరోజు విడుద‌ల‌య్యాయి. వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ తో ఈ గ్లిమ్స్ ప్రారంభ‌మైంది. 1970లోని స్టువ‌ర్టుపురంని ప‌రిచ‌యం చేస్తూ… ఈ గ్లిమ్స్‌ని రూపొందించారు. విజువ‌ల్స్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. చివ‌ర్లో ర‌వితేజ డైలాగ్ మ‌రింత ప‌దునుగా వినిపించింది. `జింక‌ని వేటాడే పులిని చూసుంటావు.. పులిని వేటాడే పులిని చూశావా` అంటూ.. ఈ గ్లిమ్స్‌కి ఓ ఎన‌ర్జిటిక్ ఎండింగ్ ఇచ్చాడు ర‌వితేజ‌. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం.. ఈ చిన్న వీడియోలోనే చూపించేశారు. జీవి ప్ర‌కాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంపాక్ట్ క‌లిగించింది. నపూర్ స‌న‌న్, గాయ‌త్రీ భ‌ర‌ద్వాజ్ క‌థానాయిక‌లుగా న‌టించారు. అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాత‌. అక్టోబ‌రు 20న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close