డ్రగ్స్ పేరుతో మళ్లీ టాలీవుడ్‌పై లీకుల దండయాత్ర !

డ్రగ్స్ అనే పేరు వస్తే చాలు… టాలీవుడ్ మీద లీకుల దండయాత్ర ప్రారంభించేస్తాయి… ముగ్గురు హీరోయిన్లు.. ఆరుగురు హీరోలు.. మరో క్యారెక్టర్ ఆరిస్టులు అంటూ.. పోలీసులు మీడియాకు లీక్ చేస్తారో లేకపోతే మీడియా వాళ్లే కల్పించుని రాస్తారో కానీ… ఇష్టారీతిన విరుచుకుపడతారు. ఇప్పుడు కూడా అదే సినిమా ప్రారంభమయింది. కబాలి సినిమాను తెలుగులో విడుదల చేసి నిర్మాత అనే పేరు వేసుకున్న కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు పట్టుకున్నారు.

ఆ కేపీ చౌదరి విలాస పురుషుడు. పార్టీలకు వెళ్లడం.. పార్టీలు ఇవ్వడం కామన్. ఆ పార్టీలకు బోలెడంత మంది వస్తారు. వాళ్లు ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ లో నుంచి బయటకు వచ్చాయి. పోలీసులే లీక్ చేసి ఉంటారు. ఆ ఫోటోలను బట్టి కథలు అల్లడం ప్రారంభించారు. టాలీవుడ మొత్తానికి ఆయన డ్రగ్స్ సప్లయర్ అని.. నలుగురు హీరోయిన్లనీ కథలు చెప్పడం ప్రారంభిచారు. ఇలాంటివి టీఆర్పీ రేటింగ్‌లు తెస్తాయని టీవీ చానళ్ల కు బాగా తెలుసు. అందుకే రెచ్చిపోతూంటారు.

నిజానికి ఎప్పుడు డ్రగ్స్ పట్టుబడినా సినిమా వాళ్లనే టార్గెట్ చేస్తారు. వారిపైనే లీకులొస్తాయి. కానీ ఇప్పటి వరకూ ఒక్క కేసులోనూ సినిమా వాళ్లు నిందితులు కాలేదు. కానీ ఇలా ఎవరు పట్టుబడినా… బాధితులుగా సినిమా వాళ్లే నిలుస్తున్నారు. నిజంగా తప్పు చేసిఉంటే.. చర్యలు తీసుకుంటే తప్పు లేదు కానీ.. మొత్తం టాలీవుడ్ పై నిందలేసి.. లాభం చూసుకుంటే ఎలా అనే ఆవేదన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close