టీ కాంగ్రెస్‌లో “చిచ్చు ఆపరేషన్” కు ఉత్తమ్ రెడీ!

తెలంగాణ కాంగ్రెస్ సోమవారం ఓ జోష్ కనిపించింది . ముఫ్పై ఐదు మంది నేతలు.. చిన్నా పెద్దా అందరూ కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. వారందరి ఆధార్ నెంబర్లతో సహా కాంగ్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వారందరూ రాహుల్ తో భేటీ అయ్యారు. ఫోటోలు దిగారు. దీనికి సీనియర్లు అందరూ హాజరయ్యారు. అంతా బాగానే ఉంది కానీ… తాను చిచ్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. తనపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సంగతిని పార్టీ స్ట్రాటజీ మీటింగ్‌లోనే తేల్చుకుంటానని ఉత్తమ్ మీడియాతో చెప్పారు. అయినా ఇలాంటిదేమైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుని బయటకు రాకుండా చేసుకుంటారు.

కానీ ముందే లోపల తేల్చుకుంటానని మీడియా ముందు బహిరంగంగా ప్రకటించడంతోనే ఉత్తమ్ కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుందని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన కోవర్టు అని.. కాంగ్రెస్ మెరుగుపడిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఓ రచ్చ చేసి.. పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ లోని మరో వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తన రాజకీయ వారసుడ్ని బీఆర్ఎస్‌లోకి పంపించింది చాలక.. ప్రతీ విషయంలోనూ బీఆర్ఎస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని…. ఇటీవల కాంగ్రెస్ సోషల్ మీడియాను సైతం పోలీసుల సాయంతో ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు.

అయితే ఉత్తమ్ కు మద్దతుగా ఎంత మంది ఉన్నారన్నది ఇప్పుడు కీలకం. ఆయన రాహుల్ తో జరిగే స్ట్రాటజీ మీటింగ్ లో ఇవన్నీ చెబుతారా… చెబితే రాహుల్ ఎలా స్పందిస్తారన్న దానిపై తెలంగాణ కాంగ్రెస్ లో ఇతర పరిణామాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. కాస్త కోలుకుంటున్న కాంగ్రెస్ ను మళ్లీ పడుకోబెట్టే ఆపరేషన్ ప్రస్తుతం ఉత్తమ్ చేతుల్లో ఉందన్న గుసగుసలు ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైవర్ట్ ఓటు…కాంగ్రెస్ కు శాపంగా మారనుందా..?

ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న...

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close