చైతన్య : వివక్షపై తిరుగుబాటు – ఫ్రాన్స్ అల్లర్లు నేర్పే పాఠం !

అమెరికాలో నల్ల జాతీయుడ్ని ఓ పోలీసు అధికారి మెడ నొక్కి చంపేసిన తర్వాత ఆ దేశంలో ఏర్పడిన అల్లర్ల తరహాలోనే ఫ్రాన్స్ లో అరాచకం జరుగుతోంది. ట్రాఫిక్ పోలీసు ఆపమన్నా ఆపకుండా వెళ్లిపోయిన ఒక టీనేజర్ ను పోలీసులు అతి దగ్గరగా కాల్పులు జరిపి చంపేశారు. ఆ తర్వాత అల్లర్లు చెలరేగాయి. నిజానికి ఫ్రాన్స్ లో అల్లర్లు తరచూ జరుగుతున్నాయి. అది ఫుట్ బాల్ మ్యాచ్ అయినా అంతే… మరో వివాదం అయినా అంతే. ఫ్రాన్స్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం.. ఆ దేశం గతంలో చేసిన తప్పులు… ఇప్పుడు చూపిస్తున్న వివక్ష. ఇది ఫ్రాన్స్ కే కాదు.. ఇప్పటి దేశాలకు కూడా గుణపాఠమే.

ప్రేమ రాజధాని పారిస్‌లో ఈ స్థాయి అల్లర్లా ?

ఫ్రాన్స్ అంటే అందరికీ ప్రపంచం మొత్తానికి తెలిసింది పారిస్, ఈఫిల్ టవర్, ఫ్యాషన్. కాన ఇప్పుడు ఫ్రాన్స్ అంటే అల్లర్లు, గొడవలు, రక్తపాతాలు ఇంకా చెప్పాలంటే కల్లోలిత ప్రాంతం. ఏదో ఒక్క సారి జరిగితే అనుకోవచ్చు. కానీ తరచుగా జరుగుతున్నాయి. కాల్పులు.. అల్లర్లు జరగని వారం..నెల ఉండటం లేదు. సుసంపన్నమైన యూరప్ దేశం అయిన ఫ్రాన్స్ కు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ దేశం గతంలో చేసిన పాపాలే. బ్రిటన్ ఇండియాను వందల ఏళ్ల పాటు వలసపాలన చేసినట్లే.. ఫ్రాన్స్ కూడా కొన్ని ఆఫ్రికా దేశాల్లో పాలన చేసింది. ఇలా ఫ్రాన్స్ వలస రాజ్యాలుగా ఉన్న దేశాలు ఎక్కువగా మొరాకో వంటి ఆఫ్రికా దేశాలు. ఫ్రాన్స్ వలస పాలన లో గడిపి .. ప్రస్తుత స్వాతంత్ర్యం పొందిన ఆఫ్రికా మూలాలు ఉన్నా లక్షల మందికి ప్రజలు ఇప్పుడు ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు. వారిపై చూపిస్తున్న వివక్ష అంతులేనంత పెరిగిపోవడంతోనే ఈ అల్లర్లు జరుగుతున్నాయి.

ఆప్రికన్, అరబ్ మూలాలున్న ప్రజలతో నిండిపోయిన యూరోపియన్ రాజధానులు

ఫ్రాన్స్ లో ఉంటున్న అరబ్, ఆఫ్రికా దేశ వాసుులకు సగం మందికి ద్వంద్వ పౌరసత్వం ఉంది. అయినప్పటికీ ప్రపంచానికి తెలియనంతగా ఫ్రాన్స్‌ లో తీవ్రమైన జాతి వివక్ష సమస్య ఉంది. అందుకే తమపై వివక్షా పూరితమైన దాడులు జరిగినప్పుడు వారు రెచ్చిపోతారు. తాజాగా పోలీస్ చేతిలో చనిపోయిన యువకుడి తల్లి అల్జీరియన్ అతని తండ్రిది మొరాకో. అమెరికాలో నల్లజాతీయులు తమపై జాతి వివక్ష కొనసాగుతోందని ఒక్క సారిగా ఎలా బ్లాస్ట్ అయ్యారో.. ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉంటున్న ఆఫ్రికన్ మూలాలున్నవారు అలా బ్లాస్ట్ అయ్యారు. అందుకే దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఆఫ్రికన్లు ఫ్రాన్స్‌లో ద్వితీయ శ్రేణి పౌరులే. శివారు ప్రాంతాల్లో ఘర్షణలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఫ్రాన్స్‌లోని ఉత్తర ఆఫ్రికన్‌లు నిరుద్యోగం, పేదరికం, వివక్ష, పోలీసు హింస మరియు సాంఘిక బహిష్కరణకు గురవుతూ ఉంటారు.

వివక్ష ఎక్కువైతే తిరుగుబాటే !

ఫ్రాన్స్‌లో ఆఫ్రికా మూలాలున్న వారిపై వివక్ష ఎక్కవగానే ఉంటుంది. ఇలాంటి వారు అత్యధికులు పేదలే. వీరంతా ఊరి చివరి కాలనీల్లో ఉంటారు. వీరిని ఓ రకంగా సంఘ విద్రోహశక్తులుగా పోలీసులు ట్రీట్ చేస్తూంటారు. శ్వేతజాతీయులు లేదా ఎక్కువ సంపన్నమైన పరిసరాల్లో నివసించే వారిని పెద్దగా పట్టించుకోరు కానీ ఈ ఆఫ్రికన్ మూలాలున్నవారిని మాత్రం తరచూ తనిఖీలు చేస్తూంటారు. ఆఫ్రికన్ ,అరబ్ మూలాలను కలిగి ఉన్న వలసదారులు యూరోపియన్ రాజధానులలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అల్లర్లు బెల్జియం, ఫ్రాన్స్‌లోని ఇతర పొరుగు దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎవరిపైనైనా కులం, మతం, ప్రాంతం, వర్ణం పేరుతో వివక్ష చూపిస్తే భరించినంత కాలం భరిస్తారు.. తర్వాత తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు ఎలా ఉంటుదో ఇప్పుడు ఫ్రాన్స్ లో చూస్తున్నాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close