సీతక్కను సీఎంను చేస్తామంటున్న రేవంత్ !

తెలంగాణ కాంగ్రెస్ లో భట్టి విక్రమార్కను ముందుకు తీసుకు రావడానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకులంతా దళిత సీఎం అనే నినాదాన్ని ఎత్తుకునే ప్రయత్నాలు చేస్తూంటే… రేవంత్ రెడ్డి వారందరికీ చెక్ పెట్టేందుకు వాట్ ఎబౌట్ గిరిజన సీఎం అంటున్నారు. అవసరం అయితే సీతక్కను సీఎంను చేస్తామని ప్రకటించేశారు. ఆమెరికాలోని తానా సభల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశం అవుతున్నాయి.

తానా సభల్లో కొంత మంది అడిగిన ప్రశ్నలకు రేవంత్ సమాధానం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలుక కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని అవసరం అయితే.. సీతక్కను సీఎంను చేసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు యాధృచ్చికంగా అన్నవి కాదని తెలంగాణ కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం పదవి సమీకరణాలపై విస్తృత చర్చ జరుగుతూండటమే. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సాధారణంగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ..సీఎం పదవి రేసులో ముందుంటారు. అయితే కర్ణాటకలో మాదిరిగా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటే వారిని సీఎం చేయాలనుకుంటే.. ఎవరు రేసులో ముందుకొస్తారో చెప్పడం కష్టం. అదే సమయంలో దళిత సీఎం నినాదాన్ని కొంత మంది కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు.

మల్లు భట్టి విక్రమార్క పార్టీ కోసం పాదయాత్ర చేశారని.. అంటున్నారు. అదే సమయంలో గిరిజనలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని గిరిజనులను సీఎంను చేస్తే. . కాంగ్రెస్ చరిత్ర సృష్టిస్తుందన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో సీతక్క పేరు తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డికి పదవి దక్కని పరిస్థితులు ఏర్పడితే..గిరిజన కోటాలో సీతక్కను సీఎం ను చేసేందుకు ప్రతిపాదిస్తారని..దానికి తగ్గట్లుగానే ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. భట్టి విక్రమార్కకు చెక్ పెట్టడం… తనకు కాకపోతే.. తన సోదరిగా చెప్పుకునే సీతక్కకు పదవి రావాలన్నది రేవంత్ ఆలోచన అన్న భావన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : సీఎం రమేష్‌తో డిబేట్‌లో ఓడిపోయిన టీవీ 9

టీవీ చానల్ చేతుల్లో ఉంది. అంతకు మించి సీక్రెట్ బాసులను మెప్పించేందుకు తెరపై చేసే విన్యాసాలకు లెక్కలేనన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంత వరకూ అదే చేశారు. కానీ అంతా సీఎం...

ముద్రగడ పేరు మార్చుకుంటారా..?పోస్ట్ వైరల్..!!

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ ఇక పేరు మార్చుకునేందుకు రెడీ అవ్వాలంటూ జన సైనికులు రూపొందించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది....

వైసీపీ సోషల్ మీడియా దుకాణ్ బంద్ !

పోలింగ్ సరళితోనే వైసీపీ దుకాణ్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రిషిరాజ్ సింగ్ నేతృతవంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక...

విషాదం… పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close