ప‌వ‌న్‌లా మారిన చిరు

కోలీవుడ్ లో సుచి లీక్స్ ఎలా ఫేమ‌సో… టాలీవుడ్‌లో చిరు లీక్స్ కూడా అంతే ఫేమ‌స్‌. త‌న సినిమాల‌కు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన విష‌యాల్ని సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం లీక్ చేస్తూ.. అభిమానుల్ని అల‌రించ‌డం చిరుకి అల‌వాటే. తాజాగా ‘భోళా శంక‌ర్‌’కి సంబంధించి, ఓ ఆస‌క్తికర‌మైన విష‌యాన్ని లీక్ చేసి, మ‌రోసారి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు.

చిరంజీవి – మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఆగ‌స్టు 11న విడుద‌ల అవుతోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌ని ఇమిటేట్ చేశారు చిరు. ‘ఖుషి’లోని ఏ మేరా జ‌హా.. పాట‌ని చిరు ఈ సినిమాలో అనుక‌రించారు. అంతే కాదు.. మెడ రుద్దుకొనే మేన‌రిజాన్నీ చిరు ఫాలో అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని సైతం చిరు త‌న ట్విట్ట‌ర్ వేదిక ద్వారా లీక్ చేశారు. ”ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినిమాలు కొన్నింటిలో న‌న్ను ఇమిటేట్ చేశాడు. ఇప్పుడు నేను త‌మ్ముడ్ని ఇమిటేట్ చేస్తున్నాను. ఇది అభిమానుల్ని అల‌రించ‌డానికి నేను చేస్తున్న స‌ర‌దా ప్ర‌య‌త్నం. ఈ సీక్రెట్ ఎవ‌రికీ చెప్పొదు…” అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు చిరు. ‘భోళా శంక‌ర్`కి ఇది క‌చ్చితంగా ఎగ‌స్ట్రా మైలేజి అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close