తెగేదాకా లాక్కుంటున్న పేర్ని నాని – ప్లానేనా ?

ఏలూరు కలెక్టర్‌తో వివాదం పెట్టుకున్న పేర్ని నాని తెగేదాకా లాక్కుంటున్నారన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాలేదని ..సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించిన ఆయన… ఈ సారి అదే మాటను.. సచివాలయంలో చెప్పారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌పై ఫిర్యాదు చేసేందుకు పేర్ని నాని సెక్రటేరియట్‌కు వచ్చారు. సీఎస్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టర్ తీరును విమర్శించడంతో పాటు.. మరోసారి జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.

పేర్ని నాని ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఏలూరు ఎమ్మెల్యే ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. పేర్ని నాని తీరుపై ఆయన సీఎంవోలో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ వెళ్లాల్సిన పని లేదని ఆయన చెబుతున్నారు. మామూలుగా అయితే.. అధికారులు సీఎస్ వద్దకు.. రాజకీయ నేతలు క్యాంప్ ఆఫీసుకు రావాలి.కానీ ఇక్కడ భిన్నంగా మాజీ మంత్రి సీఎస్ వద్దకు వెళ్తే.. ఐఏఎస్ ఆఫీసర్ ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.

దీంతో ఈ ఇద్దరి మధ్య అసలు వివాదం కాకుండా కొసరు వివాదం కూడా ఏదో ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎం కూడా పట్టించుకోనందుకే.. తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచేందుకు సీఎం ఇంటి ముందు ధర్నా అంటున్నారని చెబుతున్నారు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో కానీ పేర్ని నాని తెగేదాకా లాక్కుంటున్నారన్న అభిప్రాయానికి వైసీపీ వర్గాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్నంత పని చేస్తున్న రేవంత్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారా..? తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని శపథం చేసిన ఆయన..‌ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారా..? కేసీఆర్ ముద్రను తొలగించేందుకు కౌంట్ డౌన్ ...

హై అలర్ట్… ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు..!!

హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రజా భవన్ లో బాంబును పెట్టామని కాసేపట్లో అది పేలుతుందని గుర్తు తెలియని ఓ వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్...

ర‌ష్మిక మాట‌ల్ని డీ కోడ్ చేస్తున్న రౌడీ ఫ్యాన్స్‌

ర‌ష్మిక అంటే... విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ క్రేజ్‌. విజ‌య్‌తో ర‌ష్మిక అనుబంధం అలాంటిది. ఇద్దరూ ప్రేమ‌లో ఉన్నార‌ని, పెళ్లి కూడా చేసేసుకొంటార‌ని ఇది వ‌ర‌కే బోలెడు వార్త‌లొచ్చాయి. వాటిని వీరిద్ద‌రూ ఎప్పుడూ...

మళ్లీ దొరికిపోయిన వైసీపీ సోషల్ మీడియా..!!

వైసీపీ సోషల్ మీడియా అబద్దాల ఫ్యాక్టరీ అని మరోసారి ప్రూవ్ అయింది. ఓటమి అంచున ఉన్నప్పటికీ కూడా అవే అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైసీపీ విజయం ఖాయమని, జూన్ 9న విశాఖలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close