చైతన్య : చీప్ మినిస్టర్

చిల్లర దొంగగా ఉన్నప్పుడు చేసే పనులకు.. గజ దొంగగా మారినప్పుడు చేసే పనులకు చాలా తేడాలు ఉంటాయి. చిల్లర దొంగగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఎంత రచ్చ అయినా చేస్తాడు. దొరికిపోతే ఏమీ దాచుకోడు అలా వెళ్లిపోతాడు. అప్పుడు అది అతని స్థాయి. ఓ హోదా గల దొంగగా మారినప్పుడు.. కాస్త డిగ్నిఫైడ్‌గా ఉంటాడు. ముఖం దాుచకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందకంటే..అది అతని హోదా పెరిగిందన్నమాట. హోదా పెరిగితే కాస్త గౌరవంగా వ్యవహరించడం నేర్చుకున్నాడన్నమాట. ఇలాంటి మార్పు అన్ని రకాల జీవుల్లోనూ వస్తుంది. హోదా పెరిగే కొద్దీ హుందాతనం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంత మంది మాత్రమే భిన్నంగా ఉంటారు. అలాంటి వారు రాజకీయాల్లో ఎక్కువగా ఉంటున్నారు.

జగన్ రెడ్డికి ఆ మాటలు మామూలే.. కానీ సీఎం హోదాలో అనొచ్చా ?

జగన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలన్నారు. అనిపించారు. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు.. మంత్రులు అలా అనలేకపోయారు. ఎందుకంటే వారు ప్రజలిచ్చిన పదవులు అనుభవిస్తున్నారు. బాధ్యతల్లో ఉన్నారు. ఒక వేళ పదవులు లేకపోయినా అని ఉండేవారు కాదు. ఎందుకంటే మొదట వారు సమాజంలో గౌరవనీయమైన మనుషులు. వారు ఎలాంటి మాటలు మాట్లాడాలో.. ఎలాంటి మాటలు మాట్లాడకూడదో.. సమాజంలో మనకు ఎలాంటి గౌరవం వస్తుందో వారికి తలెుసు. కానీ సీఎం హోదాలో ఉన్న జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు.

ప్రజాధనంతో సభలు పెట్టి బూతులు మాట్లాడటం చీప్.. వెరీ చీప్

ప్రజాధనంతో సభలు పెట్టడం.. ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టడం అనే ఆలోచనే మరీ చీప్ గా ఉంది. పార్టీ సభల్లో తిడితే.. పార్టీ సమావేశాల్లో కంట్రోల్ తప్పి పోయారనుకోవచ్చు. కానీ ఆయన పెట్టింది ప్రభుత్వ సమావేశాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్‌ చెప్పినట్లుగా చేస్తూంటారు. చూసి చదవడాన్నిబట్టి అది ఆయన ప్లాన్డ్ గా ఎంచుకున్న లాంగ్వేజ్ అని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ రాజకీయాల్లో రాజకీయ విమర్శలు అనే దానికి కొత్త అర్థాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నేతలు .. విపక్ష నేతల్ని అసభ్యంగా దూషించడమే రాజకీయ విమర్శలు అయిపోయారు. ఇతర పార్టీల మహిళా నేతలు అయితే తమపై సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలపై కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. ఇది ఉన్నతంగా ఉంటుందా ?

ప్రతిపక్షాల్ని తిడితే ప్రజలు సంతోషిస్తారనుకునే మనస్థత్వం దేనికి సంకేతం

ఇలా ప్రతిపక్ష నేతల్ని తిట్టడం వల్ల తమ పార్టీని అభిమానించేవారి నుంచి మద్దతు లభిస్తుందని వైసీపీ అగ్రనేతలు అంచనాకు వచ్చారు. తమను అభిమానించే వారు విపక్ష నేతలపై వ్యతిరేకతతో ఉంటారని వారిని ఎంత ఎక్కువగా తిడితే తమపై అంత అభిమానం పెరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. కానీ ఫలితాలను తేల్చేది మాత్రం న్యూట్రల్ ఓటర్లే. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఒక్కో సారి ఓటు బ్యాంక్ ఓటర్లు కూడా షాక్ ఇస్తారు. దానికి కారణం పరిపాలన సరిగా లేకపోవడం..అనుకున్నంతగా లబ్ది పొందలేదని బాధపడటం వంటివి. అలాగే చదువుకున్న వారు.. ప్రశాంతంగా జీవనం సాగాలనుకునేవారు.. పాలకుల నుంచి విపరీత ధోరణులను ఎక్స్ పెక్ట్ చేయరు. అందుకే మన సీఎం చీప్ మినిస్టరా.. చీఫ్ మినిస్టరా అన్నది వచ్చే ఎన్నికల్లో ఓటర్లే తేల్చాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

వంగా గీతకు మంత్రిపదవా ? ఆళ్ల, మర్రి, గ్రంధి నవ్వుకుంటారు జగన్ గారూ !

కుప్పం వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెబతారు జగన్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని జగన్ ఆయన మాటల్ని కామెడీ చేస్తారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close