కరెక్ట్ ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేయలేకపోతే ఇక ఈసీ ఎందుకు !?

ఏపీలో ఓటర్ జాబితా అంశం సంచలనంగా మారింది. అడుగడుగునా ఫేక్ ఓట్లు బయటపడుతున్నాయి. అర్హులైన వారి ఓట్ల తొలగింపులు వెలుగులోకి వస్తున్నాయి. స్వయంగా సీఈవో కూడా ఇది నిజమేనని కరెక్ట్ చేస్తామని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత సీఈవోను.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి క్లాస్ తీసుకున్నారన్న ప్రచారమూ జరిగింది. ఇదంతా వాలంటీర్ల వల్లే జరిగిందని అందరికీ తెలుసు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ వారి సాయంతోనే ఓటర్ల జాబితాను సవరించడం సంచలనంగా మారుతోంది.

ఆ మధ్య జరిగిన ఉపఎన్నికల్లో .. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున టూరిస్ట్ బస్సుల్లో రావడం సంచలనం రేపింది. చివరికి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తిరుపతిలో తమిళనాడు నుంచి ఓట్లు వేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లేయడానికి తమిళనాడు నుంచి వందల బస్సుల్లో వచ్చారు. ఇవన్నీ అందరి కళ్ల ముందే జరిగాయి. కానీ ఈసీ మాత్రం పట్టించుకోలేదు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అది తప్పనిసరి కాదు. ఓటర్ కు ఇష్టమైతేనే ఇవ్వొచ్చు.

ఆధార్ లేదన్న కారణంగా ఓటు హక్కు నిరాకరించలేరు. ఇక్కడే దొంగ ఓట్లను చేర్చుకోవడానికి.. తమకు అనుకూలం కాని పార్టీల ఓటర్లను తొలగించడానికి ఓ అవకాశంగా చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు ఇందుకే వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికారుల ప్రమేయంతోనే ఇలా జరుగుతాయి. అందుకే టీడీపీ నేత పయ్యావుల కేశవ్.. నేరుగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి ఓ ప్రత్యేక టీమ్ ను.. ఉరవకొండకు పంపించారు. దీంతో అక్రమాలు బయటపడ్డాయి. బీఎల్వోలను సస్పెండ్ చేశారు. రాష్ట్రం మొత్తం అంతే ఉందన్న సంగతిని మర్చిపోయారు.

ప్రజలందరూ..ఎవరి ఓట్లను వారు స్వేచ్చగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికిసార్థకత ఉంటుంది. తమకు ఇష్టం లేనివారి ఓట్లను తీసేసి అనుకూలమైన వారితో ఓటింగ్ చేయించుకుని గెలిచామని అనుకుటే అది నియంతృత్వానికి దారి తస్తుందన్న వాదన ఉంది. ఓటర్ల జాబితాను రూపొందించడం… కూడా ఈసీకి చేతకాకపోతే ఇక ఎన్నికల నిర్వహణ ఎలా చేయగలుగుతుందేది ఎవరికైనా వచ్చే డౌట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close