స్మృతి ఇరానీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఏడుపుగొట్టు రాజకీయాలు !

కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి బలం లేదు. అయినా మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. దీనికి మూడు రోజుల పాటు చర్చకు స్పీకర్ నిర్ణయించారు. కానీ అసలు ఈ విషయంలో సంబంధం లేని విషయాలను తీసుకు వచ్చి బీజేపీ చర్చను అర్థం పర్థం లేకుండా చేసేసింది. తొలి రోజు రాహుల్ మాట్లాడలేదని.. బీజేపీ ఎంపీలు సెటైర్లు వేశారు. రెండో రోజు రాహుల్ మాట్లాడితే ప్రతీ సందర్భంలోనూ అడ్డుకున్నారు. చివరికి ఆయన ప్రసంగాన్ని మధ్యలో ముగించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత మాట్లాడిన స్మృతి ఇరానీ.. మొదట్లో కొంచెం సేపు ఇతర అంశాలపై తనదైన స్టైల్లో ప్రసంగించారు.

ఇలా ప్రసంగం ఇస్తున్న సమయంలోనే వెనుక నుంచి ఓ ఎంపీ పంపించిన స్లిప్ ఐడియాతో సీన్ మరిపోయింది. ప్రసంగిస్తూండగానే తనపై రాహుల్ గాంధీ అసభ్యంగా స్పందించారని.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపించారు. నిజమా ఇదెప్పుడు జరిగింది అని పార్లమెంట్ చూసేవారు.. పార్లమెంట్ లోని వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఆశ్చర్యాలతో బీజేపీకి పనేముండదు.. .వెంటనే స్పీకర్ దగ్గరకు వెళ్లి రాహుల్ పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కూడా అర్థం పర్థం లేని ఆరోపమలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. నిజానికి రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఎప్పుడు ఇచ్చారా అని వీడియోఫుటేజీ రీప్లే చేసుకుని చూసినా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లుగా కనిపించలేదు.

మాట్లాడుతున్నప్పుడు అడ్డుకుంటూండటంతో స్పీకర్‌తో ఆయన నోరు చూపించి …తాను మాట్లాడుతానని సైగ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీన్నే ఫ్లయింగ్ కిస్ అని బీజేపీ అన్వయించుకుని బీజేపీ రచ్చ చేసింది. అత్ంత చీప్ ఆలోచనలతో బీజేపీ పార్లమెంట్ సమావేశాలను కూడా భ్రష్టుపట్టిస్తోందని.. ఇలాంటి రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ కు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్మృతి ఇరానీ ఓ మహిళ అయి ఉండి రాహుల్‌పై ఎలా ఇలాంటి ఆరోపణలు చేస్తారన్న ప్రశ్నలూ వస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం రాహుల్ పై ఇలాంటి ఆరోపణలు చేయడానికి ప్రయత్నించడం మాత్రం ఆపడంలేదు.. అది పార్లమెంట్ అయినా సరే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close