రివ్యూ : భోళా శంకర్

Bhola Shankar movie review

తెలుగు360 రేటింగ్ 2/5

ఓటీటీ కాలంలో కూడా రీమేకులు ఎందుకని చాలా మంది అభిప్రాయపడుతున్నా .. మంచి కంటెంట్ వుంటే రిమేక్ చేయడంలో తప్పేమిటనే దృక్పధంలో వున్నారు చిరంజీవి. ఆయన రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ కూడా రిమేకే. గత ఏడాదే `లూసిఫర్` ని గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఇప్పుడు తమిళంలో విజయం సాధించిన అజిత్ ‘వేదాళం’ని ‘భోళా శంకర్’ గా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు. దాదాపు దశాబ్ద విరామం తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. మరి ఈ రిమేక్ ని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు ఎలా మలిచారు? భోళా శంకర్ గా మెగాస్టార్ ఎలాంటి వినోదాన్ని పంచారు?

శంకర్ అలియాస్ భోళా శంకర్ (చిరంజీవి )తన చెల్లాయి మహా( కీర్తి సురేష్ )చదువు కోసం హైదరాబాద్ నుంచి కలకత్తా వస్తాడు. మహా కాలేజ్ లో జాయిన్ అవుతుంది. శంకర్ టాక్సీ డ్రైవర్ గా కుదురుకుంటాడు. మ‌రోవైపు… కలకత్తాలో అమ్మాయిలని కిడ్నాప్ చేసి అక్రమంగా తరలించే ముఠా నాయకుడు అలెక్స్( తరుణ్ అరోరా). అతడి గ్యాంగ్ ని పట్టుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. టాక్సీ డ్రైవర్స్ అందరినీ పిలిచి ఆ గ్యాంగ్ లో వున్న వాళ్ళ ఫోటోలు చూపించి ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వమని కోరతారు. ఒకరోజు శంకర్ కి అలెక్స్ గ్యాంగ్ మనుషులు కనిపిస్తారు. పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తాడు. దీంతో శంకర్ ని చంపడానికి అలెక్స్ గ్యాంగ్ వెంటపడుతుంది. ఐతే వాళ్ళకు అ శ్రమ లేకుండా శంకరే ఆ గ్యాంగ్ దగ్గరికి వచ్చి అందులో చాలా మందిని క్రూరంగా చంపేస్తాడు. వాళ్ళనే కాదు మొత్తం అలెక్స్ గ్యాంగ్ ని అంతం చేయడానికే తాను కలకత్తా వచ్చానని చెబుతాడు. అసలు, శంకర్ కి, అలెక్స్ గ్యాంగ్ కి మధ్య వున్న గతం ఏమిటి? శంకర్ కలకత్తా ఎందుకు వచ్చాడు? అనేది తక్కిన కథ.

వేదాళం సినిమా వచ్చే దాదాపు ఎనిమిదేళ్ళు గడిచింది. ఆ ఎనిమిదేళ్ళ పాత కంటెంట్ ని నమ్ముకొని భోళా శంకర్ తీశారు. సినిమా చూస్తున్నపుడు ఈ మాత్రం కంటెంట్ ని చెప్పడానికి కూడా ఒక రీమేక్ సినిమాని నమ్ముకోవాలా? అనే భావన కలుగుతుంది. రాతలో గానీ, తీతలో కానీ ఎక్కడా కొత్తదనం లేకుండా ఇరవైఏళ్ల క్రితం అరిగిపోయిన పరమ రొటీన్ కమర్షియల్ మూసకొట్టుడు ధోరణిలో భోళా శంకర్ ని చూపించారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ పరమ రొటీన్ గా వుంటుంది. ఓ ప్రమాదం నుంచి ప్రజలని కాపాడుతూ హీరో ఎంట్రీ, తర్వాత అక్కడే గ్రూప్ సాంగ్, ఇంద్ర లాంటి ఫ్లాష్ బ్యాక్ వున్న హీరో అమాయకంగా టాక్సీనడుపుతూ కనిపించడం .. ఇవన్నీ తెరపై చూస్తున్నపుడు ఎంత చిరంజీవి సినిమా అయినా ఇంత రెగ్యుల‌ర్‌గా తీయాలా ? అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ అనుకున్న సీన్లు అన్నీ ఇరిటేషన్ గా తయరయ్యాయి. వెన్నెల కిషోర్ తో నడిపే సీన్లు జబర్దస్త్ ని గుర్తుకు తెస్తాయి. ఇక తమన్నా ట్రాక్ ఐతే శుద్ధ దండగ. ఆమె తెరపై కనిపించిన ప్రతిసారి.. ప్రేక్షకుడిలో అసహనం పెరిగిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో కీర్తి సురేష్ పాత్ర కాలేజ్ కి వెళ్లి రావడం తప్పితే చేసింది ఏమీ లేదు. ప్రతి సీన్ లో చిరంజీవి కనిపిస్తుంటారు తప్పితే అందులో ఎలాంటి మ్యాజిక్ వుండదు. ఎంత కమర్క్షియాల్ సినిమా అయినప్పటికీ కలకత్తా కోర్టులోనే కాదు కలకత్తా మొత్తంలో ఒక్క స్థానికుడు కనిపించడు. పాత్రలని ఎంత కుత్రిమంగా తీర్చిదిద్దారో అనడానికి ఇది నిదర్శనం. ఫస్ట్ ఆఫ్‌లో జరుగుతున్న తంతు చూసే ప్రేక్షకుడు.. త్వరగా ఎంటర్వెల్ ఇస్తే బావుణ్ణు కాసేపు రిలాక్స్ అవ్వొచ్చునే ఫీలింగ్ లోకి జారుకుంటాడంటే .. అర్ధం చేసుకోవచ్చు.. ఎంత కాలం చెల్లిపోయిన రీతిలో సినిమాని తెరకెక్కించారో.

ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కూడా ఎంట్రీలు, ఇంట్రో సాంగ్ లు వస్తాయి. ఇక్కడ భోళా కనిపిస్తాడు. కలకత్తా శంకర్ కంటే ఈ భోళా శంకర్ కాస్తలో కాస్త బెటర్. ఐతే ఇక్కడ కూడా అసలు కథ మొదలవ్వదు. ఈ సెకండ్ హాఫ్ లోనే పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ వస్తాయి. శ్రీముఖితో చేసిన ఖుషి నడుం సీన్ .. ఏదోలా వుంటుంది. పైగా ‘నేను దేకలేదు’ అనే మాటని స్వయంగా చిరంజీవితో చెప్పించి అదే మాస్ అనుకున్నారు కానీ ఇది చాలా వెకిలిగా త‌యారైంది. ఆటు శ్రీముఖి పాత్ర కూడా దీనికి సెట్ అవ్వలేదు. కీర్తి సురేష్, శ్రీముఖి ఇందులో స్టూడెంట్స్. కానీ ఇలాంటి సీన్స్ కోసం శ్రీముఖి పాత్రని మరీ వ్యాంప్ లా మార్చేయడం అవసరమా అనిపిస్తుంది. నిజానికి ఇది కీర్తి సురేష్ కథ. ఆ కథలోకి భోళా వస్తాడు. దీంతో కోర్ ఎమోషన్ లో సీరియస్ నెస్ వుండదు. పైగా భోళా కూడా తను ఎదో లక్ష్యంపై వున్నట్లు గా కనిపించడు. డ్యాన్స్ ఫైటు పాట ఇలా సాగిపోతుంటుంది సినిమా. ఇందులో అసలు కథ ప్రీ క్లైమాక్స్ లోనే పూర్తయిపోతుంది. అప్పటి కూడా ఈ సినిమాలో హీరో పాత్రని విలన్ చూసి ఎరుగడు. గట్టిగా అరుస్తూ, అప్పుడే కోమాలోంచి నిద్ర లేచిన పేషెంట్ చెప్పిన పోలిక‌ల్ని ప‌ట్టుకొని స్కెచ్ ఆర్టిస్ట్ తో బొమ్మలు గీయిస్తుంటాడు. ఇందంతా తెరపై చూస్తూ బిత్తరపోవడం ప్రేక్షకుడి వంతు.

చిరంజీవి గొప్ప ఎంటర్ టైనర్. ఆయన చేసిన కథలు, పాత్రల వలన ఆ పేరు వచ్చింది. ఒక కథలో క్యారెక్టర్ ఆర్క్ కారణంగా పాత్ర గుర్తుంటుంది. భోళా పాత్రలో అలాంటి ఆర్క్ ఏమీ లేదు. ఇందులో ఎక్కడా చిరంజీవి కొత్తగా కనిపించడు. ఇలాంటి పాత్ర చేయడం ఆయనకి నల్లేరు మీద‌ నడక. ఎలాంటి కష్టం లేకుండా సింపుల్ గా చేస్తుకుంటూ వెళ్ళిపోయారు. ఐతే ఆయన ఈ వయసులో కూడా కెమెరాముందు ఎనర్జిటిక్ గా కదలడం మెచ్చుకోదగ్గ విషయం. కీర్తి సురేష్ పాత్ర ఈ కథలో కీలకం. వున్నంతంలో ఆమె కొంచెం డీసెంట్ గా చేసింది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ లో ఇందులో ప్ర‌ధానం అని ప్రచారం చేశారు. కానీ అది పెద్దగా కదిలించలేదు. సుశాంత్ పాత్ర ఏమో కానీ తమన్నా పాత్ర ఈ కథకు అనవసరం. యాంకర్ రష్మి చిరంజీవికి పాన్ అందించి ఓ పాటకు డ్యాన్స్ చేసి మాయమైపోయింది. విలన్ గట్టిగా అరవడానికి పనికొచ్చాడు. గెటప్ శ్రీను, లోబో, వేణు, బిత్తిరి సత్తి, హైపర్ అది.. వీళ్ళంతా సినిమాలో ఎందుకున్నారో అర్ధం కాదు.

మహతి పాటలు తేలిపోయాయి. చిరంజీవికి తగ్గ ట్యూన్స్ కావవి. ఒక్క భోళా మానియా పాట మాత్రం ఓకే అనిపిస్తుంది. రీరికార్డింగ్ బాగానే చేశాడు కానీ కంటెంట్ లో ఎమోషన్ లేదు. కెమెరా కలర్ పుల్ గా వుంది. డైలాగుల్లో మెరుపులు లేవు. పైగా కొన్ని చోట్ల మరీ కృత‌కంగా అనిపించాయి. ప‌దేళ్ల త‌ర‌వాత మెగాఫోన్ ప‌ట్టిన మెహ‌ర్‌.. ఇంకా టేకింగ్ లో అప్డేట్ అవ్వకుండా, ప‌దేళ్ల క్రిత‌మే ఉండిపోయిన‌ట్టు అనిపించింది. చాలా రొటీన్ మేకింగ్. కేవలం చిరంజీవి ఇమేజ్ పైనే ఆధారపడిపోయి సీన్లు తీసుకున్నాడు. ఎక్కడా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా అంతా చూసిన తర్వాత చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. మంచి కంటెంట్ వుంటే రీమేక్ చేయడంలో తప్పు ఏమిటి ? అని ప్రశ్నించారు చిరు. సినిమా చూసిన తర్వాత ఇందులో అంత మంచిగా కనిపించిన కంటెంట్ ఏముందబ్బా ? అని ప్రశ్నించుకోవడం మన వంతవుతుంది.

తెలుగు360 రేటింగ్ 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close