తిరుమల కొండను కాలి నడకతో చేరుకున్న ఎన్ఆర్ఐ లు..

తెలంగాణా ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భం గా తిరుమల కొండ ను కాలి నడకతో చేరుకున్న అమెరికా ఎన్ఆర్ఐ లు..
శ్రీ రేవంత్ రెడ్డికి అమెరికా లో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.
రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి, శ్రీ రవి పొట్లూరి మరి కొందరు శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొనేందుకు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చారు. వారందరూ ఇంతటి విజయాన్ని శ్రీ రేవంత్ రెడ్డి కి అందించిన తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమల చేరుకొన్నారు.
‘మేమందరం ఏడు కొండలు నడిచి ఎక్కుతామని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కి మొక్కుకొన్నామని, ఇప్పుడు స్వామి వారి మొక్కు చెల్లించి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలన లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలని కొరుకొంటామని శ్రీ రవి పొట్లూరి తెలిపారు. అనుముల జగదీశ్వర్ రెడ్డి, కాట్ల రాజు, మిడుదుల సుధీర్ రెడ్డి, స్రవంత్, ఆదిత్య, ముప్పా రాజ శేఖర్ లు తిరుమల కొండ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పథంలొ ప్రయాణించాలని కోరుకున్నట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close