‘హ‌నుమాన్’ సీక్వెల్ కూడా!

పార్ట్ 2 ఈరోజుల్లో వింతేం కాదు. సినిమా హిట్ట‌యి, ఆ టైటిల్ బ్రాండ్‌గా మారితే – పార్ట్ 2కి ద్వారాలు తెర‌చుకొన్న‌ట్టే. కాక‌పోతే.. ఒకే క‌థ‌ని రెండు భాగాలుగా తీయాలా, లేదంటే ఓ సినిమా హిట్ట‌య్యాక అప్పుడు పార్ట్ 2 ఆలోచించాలా? అనేదే పెద్ద క‌న్‌ఫ్యూజన్‌గా మారింది. బాహుబ‌లి, కేజీఎఫ్‌, పుష్ప‌, స‌లార్‌… చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే రెండు భాగాలుగా చేయాల‌ని ఫిక్స‌య్యారు మేక‌ర్స్‌. ఇప్పుడు ‘హ‌నుమాన్‌’ చిత్రానికీ పార్ట్ 2 ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘హ‌నుమాన్‌’. తేజా స‌జ్జా హీరో. ఈ సంక్రాంతికి రాబోతోంది. ఈ సినిమాపై మంచి బ‌జ్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలోనూ క్రేజ్ తెచ్చుకొంది. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకొంటున్నాయి. ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ‘హ‌నుమాన్’ క్లైమాక్స్ లో సీక్వెల్ కి బీజం కూడా వేసిన‌ట్టు స‌మాచారం. హ‌నుమాన్ ఫ‌లితం అనుకొన్న‌ట్టు వ‌స్తే.. వెంట‌నే పార్ట్ 2 ప‌నులు మొద‌లెట్టేస్తారు. లేదంటే ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్ప‌టికే ఒప్పుకొన్న ‘అధీర‌’ అనే సినిమా ఉంది. దాన్ని మొద‌లెడ‌తారు. పార్ట్ 2 ఉందా, లేదా అనేది జ‌న‌వ‌రి 12న తేలుతుంది. ఆ రోజే… ‘హ‌నుమాన్’ వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

పోటీ నుంచి త‌ప్పుకొన్న కాజ‌ల్‌

అదేంటో... అంద‌రి దృష్టీ ఈనెల 31 మీదే ప‌డింది. ఆ రోజున 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గం గం గ‌ణేశా', 'భ‌జే వాయు వేగం', 'స‌త్య‌భామ‌', 'హ‌రోం హ‌ర‌' సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఏబీపీపై మళ్లీ హైకోర్టుకు జగన్ సర్కార్

ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైరయ్యే లోపు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ రెడ్డి సర్కార్ సిద్దపడటం లేదు. తప్పుడు సస్పెన్షన్లతో సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరించారని క్యాట్ తీర్పు చెపితే.. ఆ తీర్పు మీద మళ్లీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close