త్రిష క‌ల తీరుతోంది

వెట‌ర‌న్ వ‌య‌సులోనూ… వ‌రుస అవ‌కాశాల‌తో రెచ్చిపోతోంది త్రిష‌. త‌న కెరీర్‌లో ఎప్పుడూ లేనంత పీక్ స్టేజ్‌ని అనుభ‌విస్తోంది. వ‌రుస సినిమాల‌తో.. అందులోనూ స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు అందుకొని బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో ఓ సినిమా ఒప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్ వ‌చ్చింది. అందులోనూ స‌ల్మాన్ ఖాన్ తో. స‌ల్మాన్ ఖాన్ హీరోగా విష్ణువర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి `ది బుల్‌` అనే పేరు ఖ‌రారు చేశారు.1988లో ‘ఆపరేషన్ కాక్టస్’ పేరుతో ఓ మిలిటరీ జరిగింది. మాల్దీవ్స్ అధ్యక్షుడిని రక్షించేందుకు ఇండియన్ మిలటరీ ఈ ఆపరేషన్ ని ప్లాన్ చేశారు. దీని ఆధారంగా ఈ క‌థ‌ని త‌యారు చేసుకొన్నాడు విష్ణు వ‌ర్థ‌న్‌.

ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా త్రిష ఎంపికైంది. ‘క‌ట్టా – మిట్టా’ త‌ర‌వాత త్రిష ఓ బాలీవుడ్ చిత్రం చేయ‌డం ఇదే తొలిసారి. పైగా స‌ల్మాన్ అంటే త‌న‌కు చాలా ఇష్టం. ‘నా అభిమాన హీరో స‌ల్మాన్‌. త‌న‌తో క‌లిసి న‌టించాల‌ని వుంది’ అని త్రిష చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు ఆ క‌ల తీర‌బోతోంది. క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఈమ‌ధ్య బాలీవుడ్ చిత్రాల్లో సౌత్ హీరోయిన్ల హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. న‌య‌న‌తార‌, ర‌ష్మిక అక్క‌డ హిట్లు కొట్టారు. అందుకే సౌత్ క‌థానాయిక‌ల‌పై బాలీవుడ్ దృష్టి ప‌డింది. 2024 ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. 2025 ఈద్ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close