కొలికపూడిపై కేసు – అసలు ఏపీసీఐడీకి సంబంధం ఏంటి ?

అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావును అరెస్టు చేసేందుకు ఏపీసీఐడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసులు ఇచ్చారు. సాధారణంగా సీఐడీ అంటే.. ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేస్తుంది. ప్రతి చిన్నదానికి కేసుులు నమోదు చేసే అధికారం ఉండదు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు తమ పరిధిలో జరిగి నేరాలపై కేసులు నమోదు చేస్తాయి.

అయితే ఈ కేసులో సీఐడీ ఎలా కేసు నమోదు చేసిందన్నది సగటు పౌరుడికి వచ్చిన సందేహం. కొలికపూడి శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ లో నివాసం ఉంటారు. రామ్ గోపాల్ వర్మ కూడా హైదరాబాద్ నివాసి. కానీ ఆయన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా అమరావతికి వెళ్లి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు నమోదు చేశారు.

కేసు నమోదు చేయాలంటే.. నేర పరిధి అనేది ఉంటుంది. ఈ కేసు పరిధి అంతా హైదరాబాద్ లోనే ఉంది. సీఐడీ అధికారుల తీరు ఇలాగే ఉంది. మార్గదర్శి ఇష్యూలో ఎవరో యూరిరెడ్డిని ఢిల్లీ నుంచి తెచ్చి తమ దగ్గర ఫిర్యాదు తీసుకున్నారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకపోయింది. ఇటీవలే యశశ్వి అనే ఎన్నారై విదేశాల నుంచి వస్తే.. అదుపులోకి తీసుకుని .. విజయవాడ తీసుకెళ్లి41ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు. నోటీసులు ఇవ్వడనికి ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నదానిపై సీఐడీ నుంచి సమాధానం రాలేదు.

సీఐడీని దాని అధికార పరిధిని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల వేటకు వినియోగిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. కొలికపూడి విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి వేరే రాష్ట్రం కేసును తమ రాష్ట్రంలో నమోదు చేయాలనుకోవడంలోనే అధికార పరిధి ఉల్లంఘించారు. కోర్టు హెచ్చరించినా రాజకీయ బాసుల ఆదేశాలకే తలొగ్గుతున్నారు. వ్యక్తుల స్వేచ్చను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close