కేంద్రం పట్ల తెరాస అనుసరిస్తున్న వైఖరే సరయినదేమో?

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు కేంద్రం నుండి సహాయసహకారాలు పొందడానికి పూర్తి భిన్నమయిన మార్గాలను ఎంచుకొన్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్రాలలో భాగస్వామిగా ఉన్న కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడితో విధేయంగా ఉంటూ కేంద్ర సహకారం పొందుతుంటే, తెలంగాణాని కేంద్రం చిన్నచూపు చూస్తోందని నిత్యం విమర్శిస్తూ కేంద్రానికి సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి కల్పించి, కేసీఆర్ కేంద్ర సహకారం అందుకొంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవలంభిస్తున్న ఈ విభిన్నవిధానాలలో కేసీఆర్ అనుసరిస్తున్న విధానమే సత్ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడిని ఎన్నిసార్లు ప్రాధేయపడినా బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి కేవలం రూ.100 కోట్లే విదిలించారు. కానీ తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మొన్న డిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతిని కలిసి చిరకాలంగా పెండింగులో ఉన్న రాజీవ్ భీమ, జగన్నాథ్ పూర్, కొమరం భీమ్ మరియు పాలెం వాగు ప్రాజెక్టులని పూర్తి చేయడానికి తగినన్ని నిధులు విడుదల చేయవలసిందిగా కోరినప్పుడు ఆమె అందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించగానే తగిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అవి కాక దేవాదుల ప్రాజెక్టు కోసం వారం రోజులలోగా రూ. 112 కోట్లు నిధులు విడుదల చేసేందుకు ఆమె అంగీకరించారు. అంతే కాక తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా చూసేందుకు ఆమె త్వరలో హైదరాబాద్ వస్తానని చెప్పారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా వివిధ దశలలో ఉన్న ఇటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో ఏ.ఐ.బి.పి. (ఎక్సిలిరేటడ్ ఇర్రిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) అనే ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దాని ద్వారా దేశంలో ఇటువంటి పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సేకరించి ప్రాధాన్యత క్రమంలో వాటికి నిధులు కేటాయిస్తోంది. కనుక తెలంగాణాలో పెండింగులో ఉన్న ఆ ఆరు ప్రాజెక్టుల వివరాలను మంత్రి హరీష్ రావు మొన్న జలవనరుల శాఖ నిర్వహించిన సమావేశంలో తెలియజేసి వాటికి నిధులు సమకూర్చుకొన్నారు.

తెలంగాణా లేదా దేశంలో మరే రాష్ట్రంలో అయినా సరే రైతన్నలకు మేలు చేకూర్చే ప్రాజెక్టులు పూర్తిచేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈవిధంగా చొరవ చూపడం చాలా అభినందనీయమే. తెలంగాణాలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చొరవ చూపిన మంత్రి హరీష్ రావు, కేంద్రమంత్రి ఉమా భారతిని అందుకు ప్రత్యేకంగా అభినందించాలి. దేశంలో చిరకాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి. రాష్ట్ర విభజన సమయంలో దానిని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణ బాధ్యత కూడా పూర్తిగా తమదేనని ప్రకటించింది. కానీ రెండు బడ్జెట్ లలో కలిపి దాని కోసం కేటాయించింది కేవలం రూ.200 కోట్లు మాత్రమే. ఈవిధంగా అరకొర నిధులు విడుదల చేస్తున్న కారణంగా ఈ 22 నెలలలో ఇంతవరకు దాని పనులు వేగవంతం కాలేదు. తెదేపా ప్రభుత్వం దాని గురించి తరచూ కేంద్రానికి గుర్తు చేస్తునప్పటికీ ఎటువంటి స్పందన కనబడటంలేదు. అంటే కేంద్రం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మెతక వైఖరి సరికాదని, ఆ కారణంగానే కేంద్రం దాని పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని భావించక తప్పదు. ఈవిధంగా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతున్నా కూడా ఆయన పార్టీ ప్రయోజనాలను, బీజేపీతో సంబంధాలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీతో స్నేహం కోసం ఆయన ఆరాటపడుతూ కాలక్షేపం చేసేస్తే మొదటికే మోసం వస్తుందేమో ఆలోచించుకొంటే మంచిది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close