అంజిగాడు… మ‌రో గాలిశీను

అల్ల‌రి న‌రేష్ ది 60 సినిమాల కెరీర్‌. ఈ ప్ర‌యాణంలో చెప్పుకోద‌గిన పాత్ర‌లెన్నో చేశాడు. అందులో ‘గ‌మ్యం’ సినిమాలోని ‘గాలిశీను’ ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. ఎన్ని మంచి పాత్ర‌లు చేసినా… ఎన్ని మంచి హిట్లు కొట్టినా ‘గాలిశీను’ పాత్ర‌ని మ‌ళ్లీ మళ్లీ గుర్తు చేసుకొంటూనే ఉంటాడు న‌రేష్‌. త‌న అభిమానులు కూడా ‘గాలిశీను’ లాంటి క్యారెక్ట‌ర్ ఇంకోటి ప‌డితే బాగుణ్ణు అని కోరుకొంటారు. ఆ లోటుని.. ‘అంజి’గాడు కాస్త వ‌ర‌కూ తీర్చేశాడు.

నాగార్జున‌ ‘నా సామిరంగ‌’లో న‌రేష్ అంజిగాడుగా క‌నిపించాడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే పాత్ర అది. ఆ పాత్ర న‌రేష్‌కి టేల‌ర్ మేడ్ అన్న‌ట్టు ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ట‌య్యింది. ఈ సినిమాలో వినోదం పంచే బాధ్య‌త త‌నే తీసుకొన్నాడు న‌రేష్‌. చివ‌ర్లో ఎమోష‌న్ అందించాడు. ఆ పాత్ర‌ని ముగించిన తీరు హృద్యంగా ఉంటుంది. ‘నా సామిరంగ‌’ క్లైమాక్స్ పండ‌డానికి, ప్రేక్ష‌కులు ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవ్వ‌డానికి అంజి పాత్ర కీల‌కంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో న‌రేష్ చేసిన మంచి పాత్ర‌ల్లో ‘అంజి’గాడు ఒకటి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా సినిమాలు చేసుకొంటూనే, ఇలాంటి క్యారెక్టర్లు ఎంచుకొంటే.. నరేష్ వంద సినిమాల మైలు రాయిని చాలా త్వ‌ర‌గా చేరుకొనే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close