అందరూ స్ట్రాటజిస్టులే – టీడీపీకి ఇదే సమస్య !

తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో ..బయట ఎంత మంది సపోర్టు చేస్తారో కానీ అంత కంటే ఎక్కువ మందే స్ట్రాటజిస్టులు తామే టీడీపీ కోసం పని చేస్తున్నామన్న భ్రమల్లో మునిగిపోయి ఉంటారు. టీడీపీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వీరంతా.. నలభై కోణాల్లో విశ్లేషించి ఏం చేయాలో .. ఏం చేయకూడదో ప్రకటించేస్తున్నారు. జనసేనతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ చెప్పిన కొన్ని వాక్యాలను పట్టుకుని.. స్ట్రాటజిక్ సలహాలతో సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. అసలు వీళ్ల లక్ష్యం ఏమిటో వాళ్లకైనా తెలుసో లేదో మరి..!

నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు.. పొత్తు ఎందు కోసమో. వంద సీట్ల కోసం అయితే ఒంటరిగా పోటీ చేయవచ్చు కానీ.. వైసీపీని పూర్తి స్థాయిలో సీన్ లో లేకుండా చేయాలంటే పొత్తు ఉండాలన్నారు. ఆయన మాటలు అవి. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి.. ఏ సీట్లు ఇవ్వాలన్నది పై స్థాయిలో నిర్ణయించుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా పట్టుదలకు పోయి సీట్లు తీసుకుని.. ఓడిపోవాలని అనుకోరు కదా. తీసుకున్న సీట్లలో వంద శాతం గెలిస్తే చాలనుకుంటారు. పాతిక సీట్లలో పోటి చేసి పాతిక సీట్లు గెలిస్తే చిన్న విషయమా.. యాభైసీట్లలో పోటీ చేసి పాతిక సీట్లలో గెలిస్తే పెద్ద విషయమా అనే రాజకీయం వారికి తెలియదా ? పవన్ రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దానికి చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించారన్న కారణం చూపించారు. నిజానికి ఇక్కడ పోటీలు పెట్టుకోవడం కన్నా.. ఆ రెండు పార్టీలు వేగంగా నిర్ణయాలు తీసుకుని సీట్ల షేరింగ్ పూర్తి చేసుకుని అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. కానీ వారి రాజకీయ వ్యూహాలు వారికి ఉన్నాయి.

వైసీపీకి చిన్న చాన్సిచ్చినా.. ఏం జరుగుతుదో వారికి తెలుసు. పొత్తులు వద్దని కొంత మంది ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుకు సలహాలిస్తున్నారు. పవన్ నిలకడ లేని తనంపై ఉదాహరణలు చెబుతున్నారు రాజకీయాల్లో తొందరపాటు అనేది ఖచ్చితంగా పతనానికే దారి తీస్తుంది. పంతాలకు పోతే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతల జీవితాలు తలకిందులై ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పొత్తు ప్రహసనాన్ని ఎంత వేగంగా పూర్తి చేస్తే కూటమికి అంత మంచి జరుగుతుందని.. ఎక్కువమంది భావన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close