కేటీఆర్, హరీష్ రావు పాదయాత్రలు చేస్తారా ?

గోదావరి, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నీటిపోరు యాత్ర చేపడుతున్నట్లు ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం, నాగార్జునసాగర్ నుంచి ఈ యాత్ర ఉండనుంది. తెలంగాణలో నీటిపారుదల అంశంపై కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రగడ నెలకొంగి, అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకున్నారు. కాళేశ్వరం నుంచి కేటీఆర్, నల్లగొండ నుంచి హరీష్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. నల్లగొండ సభ విజయవంతం కావడంతో ఫుల్ జోష్ మీదున్న బీఆర్ఎస్..ఇదే ఊపుతో కాంగ్రెస్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహించిన మొదటి సభ నల్లగొండ భారీబహిరంగసభ. ఈ సభకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరై సభను సక్సెస్ చేశారు. ఎన్నికల తర్వాత నల్లగొండలో తొలి సభ పెట్టగా…ఇప్పుడు రెండో సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ లోపే హైదరాబద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత యోచిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ కోసం కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మరోసారి ఈ సభను నిర్వహించే ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కృష్ణా జలాల అంశం పైన ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించటానికి ఒప్పుకోలేదని కేసీఆర్ అంటున్నారు. రెండు రాష్ట్రాలకు 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల విషయం అపెక్స్ కౌన్సిల్ తేల్చాలని కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయించినా, తరువాత అపెక్స్ కౌన్సిల్ సమావేశమే జరగలేదని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ..తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ప్రజలకు చెప్పనున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close