సుభాష్ : శభాష్ పవన్ .. !

2019 ఎన్నికలకు వెళ్లే సమయంలో చంద్రబాబునాయుడు … కలిసి రా పవన్ కల్యాణ్ అని పిలిచారు. కానీ పవన్ కల్యాణ్ రానే రానన్నారు. తనకు భారీగా బలముందని..తన వెనుక సైన్యం ఉందని కింగ్ ను కాకపోయినా కింగ్ మేకర్ ను అవుతానని అనుకున్నారు. తన వెనుక తనను అభిమానించే వర్గం.. కాపు వర్గం అంతా ఉన్నారని అనుకున్నారు. నిజంగానే తామున్నామని ఆయనకు కొంత మంది భరోసా ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు రాజకీయం అర్థమైంది. తనను ఒంటరిగా పోటీ చేసేలా చేసి.. తనను రోడ్డున పడేసి మిగతా వాళ్లు ఆయాచిత లబ్ది పొందారు. 2024 ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్న రాజకీయం చూస్తే.. ఇంత త్వరగా నేర్చుకోగలరా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

జగన్ కు ఓటేస్తామనే జనసైనికుల్ని నమ్మకపోవడం మొదటి అడుగు !

ఏ పార్టీలో అయినా పార్టీ అధినేత తీసుకునే నిర్ణయానికి కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. అయితే జనసేనలో మాత్రం పవన్ నిర్ణయాలను ఖండఖండాలుగా ఖండించే.. వారు ఉంటారు. తామే జనసేను నడిపిస్తున్నట్లుగా.. తాము లేకపోతే పవన్ లేడన్నట్లుగా వ్యవహారశైలి ఉంటుంది. తాము కష్టపడి పవన్ ను … పార్టీని ఎక్కడికో తీసుకెళ్లిపోతే.. ఆయన టీడీపీతో పొత్తు అని కిందకు తేచ్చేశారని కొంత మంది చెబుతూంటారు. ఇలాంటి విశ్లేషణలు ఎక్కువైపోయాయి. చివరికి నా ఓటు వైసీపీకి అనే జనసైనికులు కూడా కనిపిస్తున్నారు. పవన్ కు గతంలో ఇలాంటి వారి పై క్లారిటీ వచ్చింది. ఒంటరిగా పోటీ చేసినప్పుడూ వేయలేదు… ఇప్పుడూ వేస్తారన్న గ్యారంటీ లేదు. ఒక వేళ ఒంటరిగా పోటీ చేస్తే.. గెలిచే చాస్ లేదు కాబట్టి వైసీపీకి వేస్తామంటారు. వాళ్లను నమ్ముకుంటే.. ఇంకేమీ మిగలదని తెలిసి… తన రాజకీయం చేస్తున్నారు. తన వెంట వచ్చేవాడే… తన వాడు అని తేల్చేసి వెళ్తున్నారు.

కాపుల గౌరవాన్ని నిలబెట్టేందుకు పవన్ కల్యాణ్ రాజకీయం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో పోటీచేశారు. పీఆర్పీకి మొత్తం 294 సీట్లలో 18 అసెంబ్లీ స్థానాలు, పోలైన ఓట్లలో 18 శాతం దక్కాయి. ఎన్టీఆర్‌ తెలుగుదేశం మాదిరిగా పీఆర్పీని ఏడు నెలల్లో పాలకపక్షంగా మార్చేద్దామనుకున్న చిరంజీవి కోరిక నెరవేరలేదు. తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశం మేరకు చిరంజీవి రాజ్యసభకు కాంగ్రెస్‌ టికెట్‌ పై ఎన్నికయ్యాక డా.మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ కేబినెట్లో పర్యాటక శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ప్రాంతీయ రాజకీయ పక్షాన్ని నడపడం కాపు హీరోల వల్ల కాదనే అపప్రధను పోగొట్టడానికి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 2014 సాధారణ ఎన్నికల ముందు జనసేన పార్టీ పేరుతో కాపులు సహా తెలుగువారందరి కోసం ప్రాంతీయ పార్టీ పెట్టారు. లోక్‌ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో ఆయన జనసేన పార్టీ నిర్మాణం జోలికి పోలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేతతో కలిసి అవశేషాంధ్రలో అనేక ఎన్నికల బహిరంగసభల్లో ప్రసంగించారు కల్యాణ్‌ బాబు. అంతేగాని అసలు రూపం, సారం లేని తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపకుండా తెలివైన చేశారు.

ఏ విధంగా చూసినా జనసేనకు అద్భుతమైన డీల్ 24 సీట్లు !

జనసేన మద్దతుతో ప్రధాని, సీఎం పదవులు పొందిన మోదీ, చంద్రబాబులతో ఏం జరిగిందో ఏమోగాని 2019 జోడు ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ఎన్నికల్లో దిగితే జనసేనాని పార్టీకి వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. అది కూడా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోనే సాధ్యమైంది. దీంతో గత ఐదేళ్లుగా ఆయన పార్టీలో తనకు కోపైలట్‌ గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ (ఎన్టీఆర్‌ కు స్వయం ప్రకటిత కోపైలట్, మొదటి విఫల వెన్నుపోటుదారుగా అపకీర్తి మూటగట్టుకున్న నాదెండ్ల భాస్కరరావు గారబ్బాయి సాయంతో జనసేనను కిందామీదా పడి నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు, ఒక శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీతో మొదట పొత్తు పెట్టుకున్నా చివరికి తెలుగుదేశం అధినేతతోనే సీట్ల సర్దుబాటు ప్రకటించడంతో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వివేకం అర్ధమౌతోంది. పెద్దన్నయ్య చిరంజీవితో పోల్చితే ఆయన చిన్న తమ్ముడే ఆంధ్రా పాలిటిక్స్‌ లో కాపుల పేరు సజీవంగా ఉండేలా చేయడంలో కొంత వరకు సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కిందటి ఎన్నికల్లో జనసేన కేవలం 5.53 శాతం ఓట్లను మాత్రమే పొందినాగాని 24 అసెంబ్లీ సీట్లలో, మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీచేయడానికి తెలుగుదేశం అధినేతను పవన్‌ బాబు ఒప్పించడం నిజంగానే కాపుల రాజకీయ చరిత్రలో చాలా గొప్ప గెలుపు.

కమ్మ, రెడ్డిలకు పోటీగా రాజకీయాల్లో కాపు ఫ్యాక్టర్

చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కురువృద్ధులు, కాకలు తీరిపోయిన తెలుగు కాపు పాత్రికేయులు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ పై విరుచుకుపడడం హేతుబద్ధంగా లేదు. పాతిక లోపు అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడం అంటే కాపుల పరువు తీయడంగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి మేధావులు భావిస్తున్నారంటే వారు రాజకీయంగా ఏ లోకంలో జీవిస్తున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం. తెలుగునాట ఎన్నికల రాజకీయాల్లో కాపు సముదాయానికి ఒకరకంగా ఎంతో మేలు జరిగిందని చెప్పవచ్చు. 2024 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల తర్వాత కాపులకు రాజ్యాధికారం రాకున్నా రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కమ్మ మాజీ సీఎం అయినా కాపుల జనామోదంతోనే మరోసారి గద్దెనెక్కుతారనే జనాభిప్రాయం పవన్‌ కల్యాణ్‌ వ్యూహాలు, ఎత్తుగడల ఫలితంగానే ప్రచారంలోకి వచ్చింది. ఏపీ 16వ శాసనసభ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కమ్మ ఫ్యాక్టర్‌ కాదనీ– కాపు ఫ్యాక్టర్‌ అని తేల్చి చెప్పినందుకైనా కల్యాణ్‌ బాబును సకలాంధ్ర కాపు కులాల సముదాయం మెచ్చుకుంటే మంచిది. ‘కే’ ఫ్యాక్టర్‌ వల్ల ఇప్పుడు జనసేనతోపాటు రెడ్డి, కమ్మల ఆధిపత్యం కాస్త ఎక్కువగానే కనపడే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఈసారి అసెంబ్లీ టికెట్లను కాపులకు వారి జనాభా నిష్పత్తికి మించి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదంతా జనసేనాని వల్లే సాధ్యమైందనుకోవాలి. చూస్తుంటే ఈసారి తెలుగునాట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మున్నెన్నడూ లేని విధంగా ‘కే’ ఫ్యాక్టర్‌ చర్చనీయాంశంగా మారుతోంది.

చేతికి వస్తున్న అధికారాన్ని కాలదన్నుకుంటోంది కాపు నేతలే !

పవన్ కల్యాణ్ గెలిస్తే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ ఆయన ఖచ్చితంగా అధికార కేంద్రం అవుతారు. గతంలో ఏ కాపు నేత అయినా కమ్మ లేదా రెడ్డిలకు జీ హుజూర్ అనే స్థాయి నుంచి సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా పొజిషన్ లో ఉన్నారా ? లేనే లేదు. కానీ ఈసారి అధికారం ఖాయం… అధికారంలో భాగం ఖాయం… కాపులకు ఎంత మేలు జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. మా బలం అంతా ఇంతా అని గాల్లో మేడలు కట్టుకునే మేధావులు మేలు చేయకపోగా కీడు చేస్తారు. అయినా సొంత నాయకుడ్ని కించ పర్చుకుంటే ఏమి రాలుతుంది బూడిత తప్ప !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close