కడప ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా వైఎస్ సునీత లేదా ఆమె తల్లి !?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది. ఈ సారి కూడా అదే హాట్ టాపిక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ నిందితుల్ని పట్టుకోలేకపోవడతో పాటు సీబీఐ విచారణకు ఆదేశించినా పురోగతి లేకపోవడంతో.. ప్రజామద్దతు, ప్రజా తీర్పు కావాలని.. ప్రజల ముందుకు వెళ్లేందుకు వివేకా కుమార్తె సునీత సిద్ధమయ్యారు. ఎన్ని ఒత్తిళ్లకు గురైనా ఆమె నితంతర పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానంలోనూ ఆమెకు ఊరట లభించలేదు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరగడం లేదు.

ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సునీత ప్రజా తీర్పు , ప్రజల మద్దతు కావాలని అడిగారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. అయితే ఏ రూపంలో వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కానీ సునీత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారని అనుకున్నారు. ఈ దిశగా ఓ సారి చర్చలు కూడా జరిపారు. కానీ కాంగ్రెస్ లో చేరికపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడం కన్నా స్వతంత్రంగా పోటీ చేస్తే అందరి మద్దతు లభిస్తుందన్న అంచనాలో ఉన్నారని అటున్నారు.

ఓ పార్టీ తరపున బరిలోకి దిగితే ఇతర పార్టీలు మద్దతు ఇవ్వవు. వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. పైగా ప్రధాన నిందితుడిగా ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకే సునీత లేదా ఆమె తల్లి అక్కడి నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తే బాగుంటుందని అప్పుడు ప్రజలు నిందితుల వైపు లేరని.. బాధితుల వైపే ఉన్నారని అర్థమవుతుందని భావిస్తున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నంత కాలం ఎప్పుుడూ వైఎస్ సునీత రాజకీయాల జోలికి రాలేదు. ఆమె వైద్యురాలు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తూ ఉంటారు. తన వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. . కానీ ఇటీవలి కాలం వరకూ రాలేదు. వివేకా హత్య నిందితులను.. రాజకీయం ద్వారా సొంత బంధువులే రక్షించాలనుకోవడంతో ఆమె ప్రజా మద్దతు కోరాలనుకుంటున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close