ఒకే వేదికపై నుంచి చంద్రబాబు, పవన్ జయహో బీసీ !

తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిసి మరోసారి సభలో పాల్గొంటున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహిస్తున్న జయహో బీసీ సమావేశంలో ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు.మొదట పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరవడంపై స్పష్టత లేదు. ఇతర కార్యక్రమాలేమీ లేకపోవడంతో తాను కూడా జయహో బీసీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది. జనసేన, టీడీపీ నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందని టీడీపీ, జనసే ననేలతలు చెబుతున్నారు. బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీకులగణన నిర్వహణకు సంబంధించిన అంశాల్ని కూడా డిక్లరేషన్లో ప్రకటించే అవకాశం ఉంది.

జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచీ బీసీలు భారీ సంఖ్యలో తరలి రాను్నారు. బీసీ డిక్లరేష్ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కూడా టీడీపీ ప్రకటించనుంది. ఇప్పటికే టీడీపీలోని ఆయా వర్గాల నేతలు.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని డిక్లరేషన్‌లో పొందు పర్చాల్సిన అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. త్వరలో జనసేన నేతలతో కూడా కలిసి.. బహిరంగసభలు ఏర్పాటు చేసి.. డిక్లరేషన్లను ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close